Bigg Boss 5 telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. 19 మంచి కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పడు ఆరు గురుమిగిలారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈ రోజు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఇక హోస్‌లో కాజల్, సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్ చంద్ర, మానస్ ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారు. ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నారు.. ఎవరు సేవ్ కాబోతున్నారు.. సేవ్ అయిన వాళ్లలో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అన్న ఉత్కంఠతో నేటి ఎపిసోడ్ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిలో సిరికి, కాజల్‌కు ఓట్లు తక్కువ పడ్డాయని తెలుస్తుంది. ఈవారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, కాజల్, మానస్‌లు ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సిరి హనుమంత్ ఈవారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యి.. ఫైనల్‌లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ వారం కాజల్ అవుట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.
తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. తాజాగా హౌస్ నాగార్జున ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో సైగలతో తమ కు ఇచ్చిన పాటను చెప్పాలి.. దాన్ని మిగిలిన హౌస్ మేట్స్ గెస్ చేయాలి. ముందుగా సిరికి వర్షం సినిమాలోని కోపమా నాపైన అనే పాట ఇచ్చారు నాగ్. దాన్ని సన్నీ చాలా ఈజీగా గుర్తుపట్టేశాడు. ఆతర్వాత సన్నీకి నీకొప్పులో నా మల్లె చెండు అనే పాట ఇచ్చాడు కానీ ఎవ్వరు గుర్తుపట్టలేదు. ఆతర్వాత మానస్ కు కాలేజ్ పాపాల బస్సు అనే పాట ఇచ్చాడు కానీ దీన్ని కూడా గుర్తుపట్టలేక పోయారు.. చివరకు ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పి టెన్షన్ లో పెట్టారు నాగ్. చూడాలి మరి ఏంజరుగుతుందో..
మరిన్ని ఇక్కడ చదవండి :