Bigg Boss 5 Telugu: మూడు వారాలకు లహరి అంత రెమ్యునరేషన్ అందుకుందా..!!

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ చాలా మందికి తెలియని వల్లే ఉన్నారు. ఇక హౌస్ లో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 19 మంది హౌస్ లోకి వచ్చారు..

Bigg Boss 5 Telugu: మూడు వారాలకు లహరి అంత రెమ్యునరేషన్ అందుకుందా..!!
Lahari

Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ చాలా మందికి తెలియని వల్లే ఉన్నారు. ఇక హౌస్‌లో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 19 మంది హౌస్‌లోకి వచ్చారు.. అయితే ఇప్పటివరకు ముగ్గురు హౌస్ నుంచి బయటకు వచ్చారు. మొదటి వారం సరయు ఇంటి నుంచి బయటకు రాగా.. రెండవ వారం.. ఉమాదేవి.. మూడవ వారం లహరి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.  అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన వారు ముగ్గురూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అయితే కావాలనే వీరిని బయటకు పంపించేశారు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. లహరి కూడా రవి, ప్రియ మొదలు పెట్టిన రచ్చ కారణంగానే బలి అయ్యిందని కొందరు అంటున్నారు. వీరిలో అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది లహరి.

లహరికి తనపై తనకు నమ్మకం ఎక్కువే. అలాగే ఆవేశం కూడా ఎక్కువే. బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లినప్పటినుంచి చీటికీ మాటికీ ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకుంటూ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలించింది. ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి కాజల్‏తో లహరికి అంతగా పడేది కాదు. కంటెంట్ కోసమే కాజల్ అలా ప్రవర్తిస్తుందని ఆవేశంతో ఊగిపోయిన లహరి.. ఆ తర్వాత తనకు హమీద సరిగ్గా మాట్లాడడం లేదంటూ గొడవ పెట్టేసుకుంది. ఇక ఆ కోపమే అమ్మడిని హౌస్ నుంచి బయటకు వచ్చేలా చేసిందని టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్నన్ని రోజులకుగాను.. లహరి అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే లహరికి వారానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట..! ఈ లెక్కన ఇప్పటివరకు లహరి  బిగ్‌బాస్‌ ద్వారా దాదాపు ఐదారు లక్షల రూపాయలు ముట్టినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Telugu 5 : రవికి అసలు విషయం చెప్పిన నటరాజ్ మాస్టర్.. ఈ సారి విశ్వతో వార్‌కు దిగనున్న రవి..

Pushpaka Vimanam: ముచ్చటగా మూడో సినిమాతో రాబోతున్న దేవరకొండ బ్రదర్.. ‘పుష్పక విమానం’ రిలీజ్ ఎప్పుడంటే..

MAA Elections: ఇది ఆత్మ గౌరవ పోరాటం, మా ఎన్నికల్లో మీరు తలదూర్చకండి.. విష్ణు షాకింగ్ కామెంట్స్‌..