Bigg Boss 7 Telugu: రైతుబిడ్డకు కెప్టెన్సీపై నాగ్‌ ప్రశంసలు.. కుళ్లుకున్న అమర్.. పాపం మళ్లీ వాతలు తప్పలేదుగా..

|

Oct 08, 2023 | 1:07 AM

బిగ్‌బాస్‌ హౌజ్‌లకు మొదటి కెప్టెన్‌గా ఎంపికైన పల్లవి ప్రశాంత్‌ను నాగార్జున మెచ్చుకున్నారు. రైతు బిడ్డ ఫస్ట్‌ కెప్టెన్ అవడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి తోటి సభ్యులు కూడా చప్పట్లు కొడుతూ ప్రశాంత్‌ను అభినందించారు. అయితే మొదటి నుంచి రైతుబిడ్డపై అక్కసు వెళ్లగక్కుతున్న సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌దీప్‌కు ఇది ఏ మాత్రం నచ్చలేదేమో. అందుకే మనసులో ఇష్టం లేకున్నా ఏదో తప్పదుకొట్టి తోటి సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టాడు. అయితే ఇక్కడే

Bigg Boss 7 Telugu: రైతుబిడ్డకు కెప్టెన్సీపై నాగ్‌ ప్రశంసలు.. కుళ్లుకున్న అమర్.. పాపం మళ్లీ వాతలు తప్పలేదుగా..
Bigg Boss Season 7 Telugu
Follow us on

బిగ్‌బాస్‌ హౌజ్‌లకు మొదటి కెప్టెన్‌గా ఎంపికైన పల్లవి ప్రశాంత్‌ను నాగార్జున మెచ్చుకున్నారు. రైతు బిడ్డ ఫస్ట్‌ కెప్టెన్ అవడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి తోటి సభ్యులు కూడా చప్పట్లు కొడుతూ ప్రశాంత్‌ను అభినందించారు. అయితే మొదటి నుంచి రైతుబిడ్డపై అక్కసు వెళ్లగక్కుతున్న సీరియల్‌ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌దీప్‌కు ఇది ఏ మాత్రం నచ్చలేదేమో. అందుకే మనసులో ఇష్టం లేకున్నా ఏదో తప్పదుకొట్టి తోటి సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టాడు. అయితే ఇక్కడే ఠక్కున అమర్‌దీప్‌ను పసిగట్టాడు కింగ్. సో.. పాపం మళ్లీ మన్మతుడి చేతిలో యథా వాయింపు తప్పలేదు పాపం అమర్‌కు. ‘కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచాడు కాబట్టే పల్లవి ప్రశాంత్‌ను పొగిడాను అమర్.. ఊరికే ఏం కాదులే అంటూ’ అమర్‌ను రప్ఫాడించాడం శనివారం బిగ్‌బాస్‌ వీకెండ్‌ ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. ఈ వాయింపు తర్వాత ఒక్కో బడ్డీ జోడీని లేపి హౌజ్‌లో వాళ్లు చేసిన తప్పుల గురించి అడిగాడు. ముందుగా అమర్‌- సందీప్‌లను లేపాడు. ‘ ఈ వీక్‌లో మీకు జరిగిన అన్యాయలు ఏమైనా చెప్పండి’ అని అడిగితే ఏమీ లేదన్నట్లు తెల్లమొహాళ్లు వేశారు అమర్‌, సందీప్‌. పాపం.. ఇక్కడ కూడా వీరిని వదల్లేదు నాగ్.. ‘ అయినా మీకేముంటాయి.. మీ వల్ల ఇతరులకు అన్యాయం జరిగి ఉంటుంది అంటూ’ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.అలాగే స్మయిలింగ్ బోర్డ్ ఛాలెంజ్‌‍లో టాస్క్ అవ్వకుండా బెల్ కొట్టడంపై అమర్‌ను వాయించేశారు నాగ్‌ సార్‌. ఇక ఫ్రూట్ నింజా టాస్క్‌లో సంచాల‌క్‌గా అమర్ సరిగా వ్యవహరించలేదంటూ వాతలు పెట్టారు.

ఆ తర్వాత ‘దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర’ టాస్కులో భాగంగా ప్రశాంత్‌పై అమర్‌ చేసిన కామెంట్లపై మరోసారి అమర్‌కు క్లాస్‌ పీకారు నాగ్‌. ‘ ప్రశాంత్ మేకప్ లేకుండా కూడా దొంగలానే ఉంటాడు’ కదా అంటూ సందీప్‌ చెబుతున్న వీడియోను చూపించిన నాగ్‌ ‘ ఒకరి లుక్ వల్ల కాదు.. చేసే పని వల్లే దొంగ, దొర అనేది తెలుస్తుంది’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఇలా మొత్తానికి అమర్‌ తప్పుల తడకల లిస్ట్‌ను వినిపించేసిన నాగ్‌ సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ను గట్టిగానే వాయించేశాడు. దీనికి స్పందించిన అమర్‌ ‘ఈసారి మిస్టేక్స్ రిపీట్ కానివ్వను సార్’ అంటే ‘ చూద్దాం.. ప్రతిసారి ఇదే చెబుతున్నావ్‌ కూర్చో’ ఫైనల్‌ పంచ్‌ ఇచ్చారు కింగ్‌. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ- శుభశ్రీ జోడి చేసిన తప్పుల గురించి అడిగి వారికి కూడా సరిపోయే రీతిలో క్లాస్‌ పీకారు నాగ్. ఆ తర్వాతి శివాజీ- పల్లవి ప్రశాంత్‌ వచ్చింది. వారికి కూడా గట్టిగానే వాయింపు పడింది. ఇలా మొత్తానికి కంటెస్టెంట్స్‌ల తప్పుల తడకలను చూపిస్తూ రౌండ్లు వేసుకున్నారు కింగ్ నాగార్జున.

ఇవి కూడా చదవండి

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి