Bigg Boss Season 7: ఎమోషనల్ డ్యామేజ్..! కంటెస్టెంట్స్‌ను ఊరించి ఉసూరుమనిపించిన బిగ్‌బాస్‌

|

Oct 06, 2023 | 1:12 AM

ఎప్పుడూ గొడవలతో.. పెడబొబ్బలతో.. రీసౌండ్ చేసే బిగ్ బాస్.. తాజాగా ఎమోషనల్‌ గా సాగింది. కాసేపు సరదా టాస్క్‌.. ఆవెంటనే వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్‌... వెరసి కెప్టెన్సీ టాస్క్‌.. అందరికీ ఓ బిగ్ ఛాలెంజింగ్‌గా.. ఎమోషనల్ డ్యామేజ్‌గా మారింది. చూసే వారిని కూడా... ఎమోషనల్ అయ్యేలా.. కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.

Bigg Boss Season 7: ఎమోషనల్ డ్యామేజ్..! కంటెస్టెంట్స్‌ను ఊరించి ఉసూరుమనిపించిన బిగ్‌బాస్‌
Bigg Boss Season 7 Telugu
Follow us on

రీ రిలీజ్ ట్రెండ్‌తో తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న థియేటర్లు ఊగిపోతున్న వేళ.. బిగ్ బాస్‌ను కూడా షేక్‌ చేసే ప్లాన్ చేశారు బిగ్ బాస్‌.. 32వ రోజు ఉదయం తొమ్మిది గంటల కల్లా.. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలోని చిట్టి ఆయీ రే సాంగ్‌ను ప్లే చేశారు. వింటేజ్‌ ఎనర్జీతో హౌస్‌లోని సభ్యులందరూ.. రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేసేలా చేశారు.

అంతకు ముందు ‘గెలిపించేది నీ నవ్వు’, ‘దొరికితే దొంగ’ టాస్క్‌తో కంటెస్టెంట్స్‌ను ఫిజికల్‌గా మెంటల్‌గా కొట్టుకునేలా చేసిన బిగ్ బాస్ .. ఈ సారి కంటెస్టెంట్స్‌కు కాస్త సరదా టాస్క్‌ ఇచ్చాడు. హౌస్‌లోని వారందరూ.. తెలుగు టీచర్లుగా మారి ప్రిన్స్ యావర్‌కు ప్రతీ ఒక్కరు.. ఐదు తెలుగు పదాలను నేర్పించాలని బిగ్ బాస్ తను పంపిన నోట్‌లో కోట్ చేస్తాడు. యావర్‌కు తెలుగు క్లాస్‌ పూర్తయ్యాక.. బిగ్ ఆదేశం వచ్చే వరకు పూర్తిగా తెలుగులో మాట్లాడాలని.. ఒక వేళ తెలుగు కాకుండా.. ఇంగ్లీష్, హిందీలో మాట్లాడిన ప్రతీ సారి.. అతని బడ్డీ అయిన తేజ ఐదు సిటప్స్‌ తీయాలని రూల్ పెడతాడు బిగ్ బాస్. ఇక టాస్క్‌కు అమర్‌ దీప్‌ను సంచాలక్‌గా వ్యవహరించమని చెబుతాడు బిగ్ బాస్.

ఇక ఈ టాస్క్‌ .. సరదాగా.. కాస్త అతిగా.. ఇంకాస్త వెగటుగా.. మరి కాస్త సిల్లీగా సాగినప్పటికీ.. అందర్నీ ఎంటర్‌ టైన్ చేస్తుంది. అందులోనూ.. ప్రిన్స్ యావర్ పులిహోర ట్యాంలెంట్ ఏంటో మరో సారి బయటికి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక మద్యాహ్నం 2 గంటలకు మరో సారి లైన్లోకి వచ్చిన బిగ్ బాస్ బడ్డీస్‌ దగ్గర ఉన్న స్టార్స్‌ను లెక్కించమని సుబ్బుకు చెబుతాడు. అయితే కేవలం రెండు స్టార్లు మాత్రేమే ఉండడంతో.. ప్రియాంక, శోభ కెప్టెన్సీ టాస్క్‌ నుంచి ఎలిమినేట్ అయినట్టు చెబుతాడు. దీంతో అప్‌ సెట్ అయిన శోభ.. ప్రియాంక దగ్గర అబ్బాయిని బడ్డీగా తీసుకుంటే.. గెలిచేదాన్ని అని చెబుతుంది. దీంతో ప్రియాంక ఫీలవుతుంది.

ఇక ఈక్రమంలోనే.. మరో సారి హౌస్‌లోకి వచ్చిన బిగ్ బాస్ వాయిస్.. మరో కొత్త టాస్క్‌తో అందర్నీ ఏడిపించేస్తాడు. ‘చిట్టీ ఆయీ రే’ అనే టాస్క్‌ ఇస్తాడు. ఈ టాస్క్‌లో భాగంగా.. కంటెస్టెంట్స్‌ ఇంటి నుంచి వచ్చిన లెటర్స్‌ను బడ్డీస్‌లో ఉన్న ఒకరు తమ ఇంటి నుంచి వచ్చిన లెటర్‌ చదవాలని.. మరొకరు వారి లెటర్‌ను చదవకుండా త్యాగం చేయాలని చెబుతాడు. లెగర్ చదివిన బడ్డీల్లో ఒక్కొక్కరే.. కెప్టెన్సీ రేసులో ముందుకు వెళతాడని బిగ్ బాస్ చెబుతాడు. దీంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ అందరూ.. ఎమోషనల్ అవుతూ.. డిస్కషన్ పెట్టకుంటారు. కానీ శివాజీ మాత్రం ఈ టాస్క్‌ ఆడనంటూ.. మొండిచేస్తాడు. కానీ ఆ తరువాత తేజ వచ్చి బిగ్ బాస్‌ చెప్పిన రూల్‌ను అర్థం అయినట్టు చెప్పడంతో.. ప్రశాంత్‌ ను గేమ్‌ ఆడమని పంపిస్తాడు.

ఇక ఈ టాస్క్‌లో భాగంగా.. యాక్టివిటీ రూమ్‌కు మొదటగా వెళ్లిన గౌతమ్‌..సుబ్బులలో.. చాలా డ్రామా తర్వాత.. సుబ్బు లెటర్‌ను సాక్రిఫైస్ చేస్తుంది. దీంతో గౌతమ్‌ కెప్టెన్సీ కంటెడర్‌గా ముందుకు వెళతాడు. ప్రిన్స్ యావర్‌, తేజ లలో.. చాలా డ్రామా తర్వాత తేజ తనకొచ్చిన లెటర్‌ చదివి కెప్టెన్సీ టాస్క్‌లో ముందుకు వెళతాడు. ఇక ఈ నలుగురు బడ్డీస్ తర్వాత.. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

 

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి