Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్‏లో ట్విస్ట్.. ఒకప్పటి స్టార్ హీరో ఎంట్రీ.. ఆ హీరోయిన్ కూడా..

|

Aug 23, 2023 | 10:47 AM

ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలతో బిగ్ బాస్ సీజన్ 7పై అంచనాలు పెంచేశారు హోస్ట్ నాగార్జున. న్యూరూల్స్, న్యూగేమ్ అంటూ చెప్పుకొస్తూ.. ఈసారి షో వేరేలా ఉండబోతుందని చెప్పేశారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈసారి 22 మంది ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ముందు నుంచి కొంతమంది పేర్లు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నారు. అందులో జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, కార్తీక దీపం ఫేమ్ మోనితా (శోభా శెట్టి), ఆట సందీప్ తన సతీమణితో కలిసి వెళ్లబోతున్నారట.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ 7 కంటెస్టెంట్స్‏లో ట్విస్ట్.. ఒకప్పటి స్టార్ హీరో ఎంట్రీ.. ఆ హీరోయిన్ కూడా..
Bigg Boss 7 Telugu
Follow us on

మరికొద్ది రోజులుగా బుల్లితెరపై అసలైన ఎంటర్టైన్మెంట్ షూరు కాబోతుంది. అడియన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. బిగ్ బాస్ రియాల్టీ షో.. గతంలో ప్రేక్షకులకు ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సీజన్ 6తో ఒక్కసారిగా ఈ షోకు ఉన్న క్రేజ్ మారిపోయింది. సీజన్ 6 అట్టర్ ప్లాప్.. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురుచూసినవారే ఎక్కువ. వరస్ట్ రియాల్టీ షో అంటూ నెట్టింట ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఇప్పుడు సీజన్ 7పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎంపికలో ఎక్కడా పొరపాటు చేయకుండా ఉండేందుకు నిర్వాహాకులు ఎక్కువగానే ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈసారి ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖాలు.. కాస్తంత ఫేమస్ అయిన వాళ్లను తీసుకువద్దామనుకుంటున్నారట.

ఇప్పటికే విడుదలైన రెండు ప్రోమోలతో బిగ్ బాస్ సీజన్ 7పై అంచనాలు పెంచేశారు హోస్ట్ నాగార్జున. న్యూరూల్స్, న్యూగేమ్ అంటూ చెప్పుకొస్తూ.. ఈసారి షో వేరేలా ఉండబోతుందని చెప్పేశారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈసారి 22 మంది ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ముందు నుంచి కొంతమంది పేర్లు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నారు. అందులో జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, కార్తీక దీపం ఫేమ్ మోనితా (శోభా శెట్టి), ఆట సందీప్ తన సతీమణితో కలిసి వెళ్లబోతున్నారట.

ఇవి కూడా చదవండి

అలాగే రుద్రవీణ ఫేమ్ శుభ శ్రీ, సింగర్ దామిని, అంజలిపవన్, పల్లవి ప్రశాంత్ (యూట్యూబర్, రైతు), అనీల్ గీలా (మై విలేజ్ షో), మహేష్ ఆచంట (రంగస్థలం), యూట్యూబర్ శ్వేత నాయుడు, సింగర్ మోహన భోగరాజు, మొగలి రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు (సాగర్) ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరెవరు వెళ్లున్నారనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకప్పటి స్టార్ హీరో లవర్ బాయ్ అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా ఇద్దరూ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నట్లుగా సమాచారం. ప్రేమ దేశం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు అబ్బాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పట్లో అబ్బాస్ కు ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా ఫేమస్. అయితే తెలుగుతోపాటు తమిళంలో కొన్ని సినిమాలు చేసిన అబ్బాస్ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి న్యూజిలాంజ్ వెళ్లిపోయారు. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారు. ఇక ఇటీవలే ఆయన తన కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు.

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అబ్బాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ తన వ్యక్తిగత విషయాలే కాకుండా.. సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాదు.. ఛాన్స్ వస్తే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది.

అలాగే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ముంబాయ్ బ్యూటీ ఫర్జానా. ఆ తర్వాత సీమ శాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ వంటి చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్జానా, ఇప్పుడు సీజన్ 7లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే సెప్టెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.