Brahmamudi, August 23rd episode: అపర్ణ, రాజ్ లను వాయించేసిన సుభాష్.. మారని తల్లీకొడుకులు.. కావ్య ఏం చేస్తుంది?

ఈరోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంటి నుంచి కావ్యని తీసుకుని కనకం, కృష్ణమూర్తిలు వెళ్తూంటారు. సరిగ్గా అప్పుడే సుభాష్ కారులో నుంచి దిగుతూ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఇంత వర్షంలో, రాత్రి నా కోడలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రకాశం వదినకు ఎదురు సమాధానం చెప్పిందని.. కావ్యని ఇంట్లో నుంచి రాజ్ గెంటేసాడు అన్నయ్య అని చెప్తాడు. దీంతో షాక్ అవుతాడు సుభాష్. ఎవరు గెంటేశారు? ఎవరు తీసుకెళ్తున్నారు? అన్నీ మీకు మీరే అనుకుని తీసుకెళ్లిపోతారా. నా కోడలిని ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. కావ్యకి పెళ్లి చేసి పంపించేశాక.. నేనే మామని, నేనే తండ్రిని అవుతాను..

Brahmamudi, August 23rd episode: అపర్ణ, రాజ్ లను వాయించేసిన సుభాష్.. మారని తల్లీకొడుకులు.. కావ్య ఏం చేస్తుంది?
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Aug 23, 2023 | 1:48 PM

ఈరోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంటి నుంచి కావ్యని తీసుకుని కనకం, కృష్ణమూర్తిలు వెళ్తూంటారు. సరిగ్గా అప్పుడే సుభాష్ కారులో నుంచి దిగుతూ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి ఇంత వర్షంలో, రాత్రి నా కోడలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రకాశం వదినకు ఎదురు సమాధానం చెప్పిందని.. కావ్యని ఇంట్లో నుంచి రాజ్ గెంటేసాడు అన్నయ్య అని చెప్తాడు. దీంతో షాక్ అవుతాడు సుభాష్. ఎవరు గెంటేశారు? ఎవరు తీసుకెళ్తున్నారు? అన్నీ మీకు మీరే అనుకుని తీసుకెళ్లిపోతారా. నా కోడలిని ఈ ఇంట్లో నుంచి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. కావ్యకి పెళ్లి చేసి పంపించేశాక.. నేనే మామని, నేనే తండ్రిని అవుతాను అని చెప్తాడు. పదండి అంటూ కావ్య చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తాడు సుభాష్.

రాజ్ నీకు నేను ఏం అవుతాను? చెప్పు నీకు నేను ఏం అవుతాను? అని ప్రశ్నిస్తాడు. కన్న తండ్రి అని రాజ్ సమాధానం ఇస్తాడు. కన్న తండ్రి ఇంట్లో లేనప్పుడు నీకు నువ్వే నిర్ణయం తీసుకునేంత పెద్దవాడివి అయిపోయావా?, అత్తా కోడళ్లకు గొడవలు వస్తే.. కొడుకు కోడలిని గెంటేసేవరకు వస్తే తగ్గాల్సింది ఎవరు? అత్తగారే కదా? నువ్వేం చోద్యం చూస్తున్నావ్ అపర్ణ? అంటే నా కొడుకు కాపురం కూలిపోయినా పర్వాలేదు.. నువ్వు మాత్రం గెలవాలని పంతమా.. అత్తగారివి అయ్యి ఉండి.. అర్థరాత్రి కోడలిని వర్షంలో, చీకట్లో కొడుకు బయటకు వెళ్లగొడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావ్? అంత అహంభావమా? ఇంత అమానుషమా? ఏమైంది ఈ ఇంటి సంస్కారం అంటూ కడిగిపడేస్తాడు సుభాష్. దీంతో అందరూ అలా చూస్తూ ఉండిపోతారు.

అదేంటన్నయ్యా? వదినను అంటావ్.. వాళ్లకు మామూలు అహంకారం లేదు అంటూ రుద్రాణి మాట్లాడబోతే.. నోరు అదుపులో పెట్టుకో అంటూ ఫైర్ అవుతాడు సుభాష్. రుద్రాణి నోరు అదుపులో పెట్టుకో.. నువ్వు మా ఇంట్లో పడి ఉన్నట్టు.. కావ్య కూడా భర్తను వదిలేసి వాళ్ల ఇంట్లో పడి ఉండాలా? నా కొడుకు, కోడలు చూసి ఓర్వలేకపోతున్నావా? నా భార్య మతి చెడిందంటే.. దానికి సగం కారణం నీ చెప్పుడు మాటలు వినడం వల్లనే అంటూ చెడామడా కడిగిపారేస్తాడు. ఆ తర్వాత ఓ మీరూ ఇక్కడే ఉన్నారా? మాట్లాడితే వంశ చరిత్ర గురించి చెప్తారు కదా.. ఇప్పుడేం అయ్యింది మీ పెద్దరికం? అంటూ సుభాష్ తల్లిదండ్రులను నిలదీస్తాడు. సుభాష్.. నీ కొడుకు బూడిద పాలు చేశాడు. నీ భార్య విలువ లేకుండా చేసింది. ఈ రోజు ఈ అవమానం జరిగింది ఈ ఇంటి కోడలికే కాదు.. మా వయసుకు.. మా అనుభవానికి.. మా పెద్దరికానికి అవమానం జరిగింది. నా భర్త మాటకే విలువ లేకుండా చేశారు ఈ తల్లీ కొడుకులు.. అంటూ బాధపడుతుంది ఇందిరా దేవి. నానమ్మా.. అంటూ రాజ్ అనబోతే ఆపూ అంటూ ఇందిరా దేవి సీరియస్ అవుతుంది.

నీ ఆవేశమే ఇంతటి అనర్థానికి కారణం అయింది. ఆ కన్న తల్లి ఉసురు మన ఇంటికి తగలకముందే.. ఈ ఇంటి కోడలి కన్నీరు మన వంశానికి శాపంగా మారకముందే మీరందరూ మేలుకోండి అంటూ చీవాట్లు పెడుతుంది ఇందిరా దేవి. నీ కన్న తండ్రి రమ్మన్నాడని వెళ్తే నువ్వు నీ పుట్టింటికి వెళ్తే.. నీ ఉనికి, నీ వ్యక్తిత్వం, నీ అస్థిత్వం అన్నీ ఇక్కడే వదిలేసుకుని.. ఒక సాధారణ స్త్రీలా వెళ్లినదానివి అవుతాం. నీ వ్యక్తిత్వంలో ఒక పరిణితి ఉంది. నీ సహనంలో ఒక పెద్దరికం దాగి ఉంది. అన్నీ వదిలేసుకుని తల దించుకుని వెళ్లిపోయేంత తప్పు నువ్వు ఏమీ చేయలేదమ్మా.. ధైర్యంగా నీ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టు. లోపలికి వెళ్లమ్మా. నేను చెప్తున్నా నువ్వు లోపలికి వెళ్లు అని అంటాడు సుభాష్. ఈలోపు కావ్య తల్లిదండ్రులు క్షమించండి అని చెప్పగా.. అయ్యో వద్దండి.. మీరే మా అందర్నీ క్షమించాలి. మళ్లీ ఇంకెప్పుడూ మీ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రానివ్వని మాట ఇస్తున్నా.. ధైర్యంగా వెళ్లి రండి అంటూ కనకం-కృష్ణమూర్తిలకు చెప్తాడు సుభాష్.

ఇక అందరూ లోపలికి వెళ్తారు. ఇందుకిలా చేశారు? అని అని సుభాష్ ని ప్రశ్నిస్తుంది అపర్ణ. మరో మార్గం కనిపించలేదు అని సుభాష్ చెప్తాడు. ఇక వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంటే కావ్య తప్పు చేయలేదా? అని అపర్ణ అనగా.. చేసిందని మీరు అనుకుంటున్నారు అని సుభాష్ చెప్తాడు. తప్పు మీకు కనిపించలేదా? కావ్య చేసింది తెలుసుకోకుండా ఆ నిర్ణయం తీసుకుని తొందర పడ్డారు. ఆ కావ్యని ఒక్కసారి పుట్టింటి పంపించి ఉంటే.. మన విలువ తెలిసి వచ్చేది. తను ఎంత పెద్ద తప్పు చేస్తోందో.. మన ఇంటి పరువుతో ఎలా ఆడుకుంటుందో తనకు అర్థమయ్యేదని అని అపర్ణ అంటుంది. కనిపించలేదు కాబట్టే లోపలికి పిలిపించా.. నాకు అలా అనిపించడం లేదు అపర్ణ.. నువ్వు చెప్పినట్టు చేయలేదని కోడలి మీద కక్ష్య తీర్చుకుంటున్నట్లు అనిపించింది. నాకే కాదు.. రేపు సమాజానికి కూడా అనే అనిపిస్తుంది అని చెప్తాడు సుభాష్.

కానీ మీకు మాత్రం కావ్య చేసిన తప్పులు కనిపిడం లేదు.. మన అబ్బాయిని ఎలా చూసుకున్నాం.. ఎలా పెంచాం.. ఈ రోజు ఆ కావ్య మట్టి తొక్కించింది. ఒక మామూలు మనిషిని చేసి రోడ్డున నిల్చోబెట్టింది అని అపర్ణ చెబుతూ ఉంటుంది. రాజ్ కూడా అందరిలాగే మామూలు మనిషే. నీకు కొడుకు కాబట్టి.. తన మీద పెంచుకున్న ప్రేమ వల్ల మహారాజులా చూస్తున్నావ్.. అందర్నీ అలాగే చూడమంటున్నావ్. నిజం ఏంటంటే మహారాజు కూడా మనిషే. అందరితోనూ కలిసి తిరుగుతేనే గొప్ప నాయకుడు అవుతాడు అంటూ చెప్తాడు. నేను కావ్యని లోపలికి రమ్మన్నానని ఆవేశ పడుతున్నావ్. కానీ నేను అలా చేయకపోతే అప్పుడు నిజంగానే మన ఫ్యామిలీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. పేదింటి నుంచి కోడలిని తీసుకొచ్చారు కానీ.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే అయిపోయింది. అప్పుడే విడాకులు వరకూ వెళ్లారని తప్పుడు ప్రచారం చేసి మన పరువు తీస్తారు. కావ్య పట్టుదల గురించి చూస్తూనే ఉన్నాం కదా.. ఒక్కసారి ఇది నా ఇల్లు కాదు అని నిర్ణయం తీసుకుంటే.. ఇక జీవితంలో ఈ గడప తొక్కదు కావ్య.. నువ్వు అనుకుంటున్నట్టు తప్పు తెలుసుకుని వస్తుందను కోవడం నీ అమాయకత్వమే తప్ప.. అలా ఎప్పటికీ జరగదు అని అంటాడు సుభాష్. కానీ అపర్ణ మాత్రం కావ్యని అస్సలు కోడలిగా ఒప్పుకోదు.

ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణమూర్తిలు కావ్య గురించి ఆలోచిస్తూ బాధపడతారు. కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని ఆవేశంలో.. ఏం చేస్తున్నానో తెలీకుండా.. కావ్యని ఇంటికి తీసుకొచ్చేయాలి అనుకున్నా. సమయానికి వియ్యంకుడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతో ప్రమాదం జరిగేది. మీ స్థానంలో ఏ తండ్రి ఉన్నా అలానే జరిగేది అని కనకం చెప్తుంది. క్షమిస్తే సరిపోతుందా.. చేయాల్సిన అవమానం అంతా చేశారు. ఆఖరికి వియ్యంకుడు వచ్చి క్షమాపణ అడిగే సరికి.. అక్కని అక్కడే వదిలేసి వచ్చేస్తారా? తప్పు చేశారు మీరు.. అక్కని గెంటేసిన వారిని వదిలేసి వచ్చారు. అక్కడ నేను గనుక ఉండి ఉంటే.. ఒక్కర్ని కూడా వదిలి పెట్టేదాన్ని కాదు అని అప్పు ఆవేశ పడుతుంది. జరిగిన గొడవ చాలాదా.. వాళ్లని విడగొట్టాలి అనుకుంటున్నావా.. అని కనం అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా.. నిజంగా అక్కని కోడలిగా చూసేవారు అయితే ఆ పని చేస్తారా? ఇంట్లో అంత మంది ఉన్నారు.. వర్షంలో ఒక ఆడపిల్ల తడుస్తూ ఉంటే జాలి కూడా లేకుండా చూస్తూ ఉండిపోయారు అంటూ అప్పు తిట్టిపోస్తుంది. అది నీకు అర్థం కావాలంటే.. నీకు పెళ్లి జరగాలి.. ఆ ఇంటిని నీ ఇల్లు అనుకుంటే తెలుస్తుంది అని చెప్తుంది కనకం. తెంచుకోవడానికి ఎంత సేపు అప్పు.. క్షణం పట్టదు.. కానీ అతి తిరిగి అతకాలంటే చాలా సమయం పడుతుంది అని కనకం అంటుంది. దీంతో కోపంతో అప్పు అక్కడి నుంచి వెళ్తుంది. అయితే అప్పు చెప్పేది కూడా కరెక్టే అంటాడు కృష్ణమూర్తి. వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉన్నారనుకున్నాం కానీ.. కానీ మనసులో అంత విషం పెట్టుకున్నాడు అనుకోలేదు. అలాంటప్పుడు వాళ్లిద్దరూ కలిసి ఎలా ఉంటారు అని బాధపడతాడు. ఇదంతా చూస్తుంటే కావ్యకి పెళ్లి చేసి తప్పు చేశానా? అని కనకం ఏడుస్తుంది.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య. ఏవండీ అని పిలుస్తుంది. కానీ రాజ్ మాత్రం కోపంగా ఉంటాడు. నిజానికి మీరు నన్ను మాట్లాడించాలి. చేసిన అవమానానికి మీరు గిల్టీగా ఫీల్ అవ్వాలి. అయినా నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. కనీసం నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. కనీసం ఏం జరిగిందో చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం ఇవ్వడం లేదు. నేను అత్తయ్య గారికి కావాలని ఎదురు చెప్పలేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. అనుకోకుండా జరిగింది అని కావ్య చెప్పబోతుంటే.. రాజ్ ఆవేశంగా తలుపును కొడతాడు. దీంతో రాజ్ చేతికి రక్తం కారుతూ ఉంటుంది. కావ్య కంగారు పడుతుంది. అయినా రాజ్ సమాధానం చెప్పకుండా వెళ్లి పడుకుంటాడు. రాజ్ పడుకున్నాక.. చేతికి బ్యాండేజ్ వేస్తుంది కావ్య. ఇక ఈరోజుతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్లీ రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?