
బిగ్‌బాస్ సీజన్ 9.. ఏడో వారం నడుస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్ 9పై విమర్శలు వస్తున్నాయి. కంటెస్టెంట్స్ ఆట తీరు పై మండిపడుతున్నారు. షో మొదలైన మొదటి వారం నుంచి ఇప్పటివరకు గొడవలు, అరుపులతో రచ్చ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ స్ తర్వాత ఈ షోపై విపరతీమైన నెగిటివీ వస్తుంది. వైల్డ్ కార్డ్స్ రావడంతోనే పాత కంటెస్టెంట్లను పర్సనల్ అటాక్ చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇక ఇప్పుడు మరోసారి ఈ షో చిక్కుల్లో పడింది. తాజాగా హీరోయిన్ సంజన గల్రానీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతుంది. ముందు నుంచి తన ఆట తీరు, ప్రవర్తనతో విసుగు పుట్టించిన సంజన… ఇప్పుడు తన నోటికి పనిచెప్పింది. తన తోటి కంటెస్టెంట్ పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియోలో సంజన రమ్య మోక్షతో మాట్లాడుతూ మరో కంటెస్టెంట్ దివ్య నికిత గురించి బాడీ షేమింగ్ చేసింది. దివ్య ఒక రోడ్ రోలర్ మాదిరిగా తన మీదికి ఎక్కేస్తుందంటూ రమ్యతో సంజన చెప్పిన వ్యాఖ్యుల తెగ వైరలవుతున్నాయి. మరోసారి కళ్యాణ్ పట్ల గకూడా అలాగే ప్రవర్తించింది. కళ్యాణ్ లో క్లాస్ అంటూ మాట్లాడింది. ఒక సెలబ్రెటీ చుట్టూ తిరుగుతున్నావ్ అంటూ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా మాటల దాడి చేసింది. దీంతో సంజన ప్రవర్తన, బిహేవియర్ పై మండిపడుతున్నారు అడియన్స్. హౌస్ లో కంటెస్టెంట్లను తక్కువ చేస్తూ.. బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం ఏంటని..? ప్రశ్నిస్తున్నారు. సంజనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
కొన్ని రోజులుగా బిగ్‌బాస్ షోపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అనవసరమైన విషయాలపై గొడవ పెట్టుకోవడం.. గట్టి గట్టిగా అరుస్తూ.. కావాలని కెమెరా ఫుటేజ్ కోసం అతి చేయడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి. కేవలం అరుపులు, బూతులు మాత్రమే వినిపిస్తున్నారు. హోస్ట్ నాగార్జున హెచ్చరించినప్పటికీ కంటెస్టెంట్స్ తీరులో ఎలాంటి మార్పులు రావడం లేదని.. దీంతో బిగ్‌బాస్ షోపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
Can I get answer from #sanjanagalrani for this body shaming I this weekend @iamnagarjuna ??
Rt for more visibility#biggbosstelugu9 #biggboss9telugupic.twitter.com/loa7fPlY3b
— Edits reposter (@Inspiritmodee) October 24, 2025
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..