Bigg Boss 9 Telugu: పచ్చళ్ల పాపకు ఊహించని షాక్.. బి‏గ్‏బాస్ హౌస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్..

బి‏గ్‏బాస్ సీజన్ 9 ఇప్పుడు జనాలకు ఆకట్టుకుంటుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్ జరిగాయి. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, హరీష్ హరిత, శ్రీజ దమ్ము, భరణి, ఫ్లోరా షైనీ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలో శ్రీజ దమ్ము అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని.. కేవలం వైల్డ్ కార్డ్స్ కోసమే శ్రీజను బయటకు పంపించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

Bigg Boss 9 Telugu: పచ్చళ్ల పాపకు ఊహించని షాక్.. బి‏గ్‏బాస్ హౌస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్..
Ramya Moksha

Updated on: Oct 26, 2025 | 2:22 PM

బి‏గ్‏బాస్ హౌస్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఒక్కో కంటెస్టెంట్ స్ట్రాటజీ, గేమ్ , మాట తీరు ఒక్కో విధంగా ఉంటుంది. హౌస్ లోకి వెళ్లకముందు పాజిటివ్ ఫాలోయింగ్ ఉన్నవారు చివరకు నెగిటివిటీతో బయటకు వచ్చిన సందర్భాలు బోలేడు. కొన్నిసార్లు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుంటారు. మరికొన్ని సార్లు ఓటింగ్ తక్కువ వచ్చిన కంటెస్టెంట్స్ సైతం హౌస్ లో చివరి వరకు నెట్టుకోస్తాడు బి‏గ్‏బాస్. ఇక ఇప్పటివరకు సీజన్ 9లో ఊహించిన ఎలిమినేషన్స్ జరిగినప్పటికీ.. శ్రీజ దమ్మును అనుహ్యంగా బయటకు పంపించారు. దీంతో ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని.. ఎలాగైనా శ్రీజ రీఎంట్రీ ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇప్పుడు మరో ఎలిమినేషన్ సమయం దగ్గర పడింది. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిటన్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

ఇక ముందు నుంచి ఊహించనట్లే హౌస్ నుంచి పచ్చళ్ల పాప అలియాస్ రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్లు టాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రమ్య మోక్ష.. ఫుల్ నెగిటివిటీతో హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక రావడంతోనే తనూజను అటాక్ చేసింది. ఆమె పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ.. బ్యాక్ బిచింగ్ చేస్తూ నెగిటివిటీని మూట గట్టుకుంది. అబ్బాయిలతో ఫిజికల్ టాస్కులలో గట్టిగానే పోటీపడుతున్నప్పటికీ ఆమె నోటి దురుసు కారణంగా విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. తనూజ, కళ్యాణ్ రిలేషన్ గురించి అనవసర వ్యాఖ్యలు చేయడం.. ఇతర కంటెస్టెంట్స్ దగ్గర అటిట్యూడ్ చేయడం ఆమెకు మైనస్ అయ్యాయి. ఈ వారం నామినేషన్లలో రీతూ, సాయి శ్రీనివాస్, దివ్య, తనూజ, సంజన, కళ్యాణ్ ఉండగా.. వీరిలో సాయి శ్రీనివాస్, రమ్యకు తప్పితే మిగతా అందరికి మంచి ఓటింగ్ వచ్చింది. అయితే రమ్య నోటి దురుసుతో చిరాకు పడిన అడియన్స్ ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని సాయి శ్రీనివాస్ కు ఓటింగ్ గుద్దిపడేశారు. రమ్య డేంజర్ జోన్ లోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

ఇక ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే. టైఫాయిడ్, డెంగ్యూ, జ్వరంతో బాధపడుతున్న ఆయేషా.. స్వయంగా హౌస్ నుంచి బయటడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారని.. అందులో ఇద్దరు కంటెస్టెంట్స్ తిరిగి హౌస్ లో ఉండనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..