Bigg Boss 9 Telugu : ఊహించిందే జరిగిందిగా.. డబుల్ కాదు.. సింగిల్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ నుంచి ఫైర్ బ్రాండ్ అవుట్..
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపుకు చేరుకుంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ వారం సంజన, సుమన్ శెట్టి, దివ్య డేంజర్ జోన్ లో ఉండగా.. అత్యదిక ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు కళ్యాణ్. ఇక ఆ తర్వాత తనూజ ఉండగా.. భరణి, ఇమ్మాన్యుయేల్ కు సైతం మంచి ఓటింగ్ వస్తుంది.

బిగ్‌బాస్ సీజన్ 9.. ఈ వారం నామినేషన్స్ రచ్చ గురించి తెలిసిందే. హౌస్ లో గొడవలు కాదు.. పర్సనల్ అటాక్ వరకు వెళ్లింది. రీతూపై సంజన చేసిన కామెంట్స్ హౌస్మేట్స్, ఇటు అడియన్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఇదే గొడవ పై గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున. శనివారం నాటి ఎపిసోడ్ లో సంజనపై హౌస్మేట్స్ మొత్తం రివర్స్ కాగా.. సారీ చెప్పాలంటూ ఆర్డర్ వేశారు నాగార్జున. బయటకు అయినా వెళ్లిపోతాను కానీ సారీ చెప్పను అంటూ నాగార్జునకే షాకిచ్చింది. తాను చూసిందే చెప్పానని.. కావాలని ఏం చెప్పలేదంటూ తన సైడ్ వాధించింది సంజన. మొత్తానికి ఆమె చేత బలవంతంగా సారీ చెప్పించారు నాగార్జున. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు హౌస్ లో ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది.
ఈ వారం దివ్య నిఖిత, సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ముందు నుంచి అతి తక్కువ ఓటింగ ఉంది మాత్రం దివ్యకే. నిజానికి గతవారం ఎలిమినేట్ కావాల్సిన దివ్య… నో ఎలిమినేషన్ రావడంతో సేఫ్ అయ్యింది. కానీ ఈసారి మాత్రం ఓటింగ్ తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దివ్య ఎలిమినేషన్ ముందు నుంచి ఊహించినదే. అలాగే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ వినిపించింది. కానీ అలాంటిదేమి లేదని.. కేవలం సింగిల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు దివ్య బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
దివ్య ఎలిమినేషన్ కు కారణం.. భరణితో బాండింగ్స్.. తనూజతో గొడవలు. భరణిపై పెత్తనం చెలాయించడం చాలా మందికి నచ్చలేదు. అలాగే భరణి, తనూజతో మాట్లాడితే చాలు గొవడ పెట్టుకుంది. దీంతో ఆమె పై నెగిటివిటీ పెరిగింది. దివ్య డిమాండింగ్ వల్లే భరణి ఆట తగ్గిపోయిందని నెటిజన్స్ అభిప్రాయం. దీంతో దివ్య బయటకు పంపిస్తే బెటర్ అంటూ మిగతా కంటెస్టెంట్లకు ఓటింగ్ గుద్దిపడేశారు. ఈవారం దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..




