
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలసిందే. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే సైతం నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి ఈ షోలో విన్నర్ అనగానే ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనూజ. ఎందుకంటే.. ఈసీజన్ మొత్తంలో హౌస్ లో తనూజ ఎన్ని తప్పులు చేసినప్పటికీ అటు బిగ్ బాస్ గానీ.. ఇటు హోస్ట్ నాగార్జున గానీ పట్టించుకున్నది లేదు. అంతేకాదు..ఆమెకు ఫుటేజ్ ఎక్కువగా ఇస్తున్నారన్నది ముందు నుంచి వినిపిస్తున్న మాట. హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ టాస్కులలో ఇరగదీస్తుంటే.. తనూజ మాత్రం సాయం లేకుండా గెలిచింది లేదు. కానీ బయట సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే అదే స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ సైతం నడుస్తుంది. ఇదెలా ఉంటే.. ఇప్పుడు తనూజను ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
కొన్నిరోజులుగా తనూజకు సంబంధించిన పలు వీడియోస్ షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతుంది. అందులో డీమాన్, రీతూ రిలేషన్ షిప్ గురించి రెండు మాటలు మాట్లాడింది. ముందుగా కళ్యాణ్ దగ్గర తనూజ మాట్లాడుతూ.. డీమాన్ గేమ్ రీతూ వల్ల ఎప్పుడూ ఆఘలేదు.. కానీ రీతూ పిచ్చిది డీమాన్ కోసం బ్యాడ్ అయ్యింది అంటూ తనూజ చెప్పింది. అలాగే భరణి, దివ్య దగ్గర సైతం ఇదే టాపిక్ రాగా.. రివర్స్ మాట్లాడింది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
రీతూ పవన్ కు ప్లాస్సా మైనస్సా అని తనూజను భరణి అడగ్గా.. ప్లస్ యే.. మైనస్ ఎలా అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చింది. రీతూ పవన్ కు ప్లస్సా.. ఏంటి తనూజ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ భరణి , దివ్య క్వశ్చన్ చేయగా.. సంచాలక్ గా ఉన్నా కూడా తనని గెలిపించడానికి ట్రై చేసిందిగా రీతూ అంటూ తనూజ డిఫెండర్ చేసుకుంది. అలా కాదు పవన్ ఓవరాల్ గేమ్ కు రీతూ ప్లస్సా.. మైనస్సా అంటూ భరణి మళ్లీ అడగడంతో.. గేమ్ కు మైనస్సే.. వాడు సొంతంగా ఆడితే ఎక్కడో ఉంటాడు అంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు. అందులోనూ కళ్యాణ్, తనూజ మధ్య గట్టిపోటీ ఉంది. అయితే కళ్యాణ్ మాత్రం తన ఆటను పక్కనపెట్టేసి.. తనూజ చుట్టూ తిరుగుతూ.. ఆమె కోసం తన గేమ్ వదిలేస్తున్నాడని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
#BiggBossTelugu9
Thupuja is brutally exposed watch till the end
Thupuja pans chusi tarinchandi pic.twitter.com/9HJJDe3w8v— kalyan (@ForverThing) November 20, 2025
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..