
బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పుడు ఏడో వారం ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. శనివారం నాటి ఎపిసోడ్ లో ఒక్కో కంటెస్టెంట్ కు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగార్జున్. తనూజ, సంజన, మాధురి, రమ్య మోక్షకు కౌంటర్స్ ఇస్తూనే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇలాగే సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ ఇమ్మాన్యుయేల్ ను ఇరికించారు. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత షో గాడి తప్పింది. ప్రతి క్షణం గొడవలు.. లేదంటే పర్సనల్ అటాక్ చేయడం.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుండంతో అడియన్స్ షో చూడాలంటేనే చిరాకు పడుతున్నారు. మరోవైపు ప్రతి రోజూ ఒకే విధమైన హడావిడి.. అనవసరమైన విషయాలకు గొడవలతో సీరియల్ స్టోరీలా సాగుతుంది బిగ్ బాస్. అయితే అటు కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకులకు సైతం సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట బిగ్‌బాస్. ఇప్పటికే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ రాబోతున్నారని టాక్. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. అందులో కొందరిని మళ్లీ హౌస్ లోకి పంపించనున్నారట.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
ముందుగా మనీష్, హరీష్, భరణి, శ్రీజ, ప్రియ లను హౌస్ లోకి పంపించనున్నారని సమాచారం. అలాగే ఈ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ సైతం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేతుల్లో ఉంటుందని టాక్. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి ఎనిమిదవ వారం నామినేషన్ ప్రక్రియ చేస్తారని.. అందుకే వీరందరిని హౌస్ లోకి తిరిగి పంపించనున్నారట. అంతేకాదు.. ఇందులో మరో ట్విస్ట్ ఉంది. వెళ్లిన కంటెస్టెంట్లలో ఇద్దరిని హౌస్ లో ఉంచనున్నారట. అందుకు ఒక ప్రాసెస్ ఉంటుందని.. అదేంటో ఆదివారం ఎపిసోడ్ లో రివీల్ చేయనున్నారట. ఆదివారం ఎపిసోడ్ అనంతరం పాత కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లనున్నారట.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
నిజానికి శనివారం హోస్ట్ నాగార్జున చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరు నామినేట్ చేస్తుంటారు. అందురు కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లో ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా వచ్చి నామినేట్ చేసినట్లుగానే ఈసారి కూడా పాత కంటెస్టెంట్స్ నామినేట్ ప్రక్రియ చేస్తారని సమాచారం. ఆ తర్వాత ఓ ప్రక్రియ ద్వారా ఇద్దరు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లో ఉంచనున్నారని టాక్. మరీ ఈసారి హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేది ఎవరో చూడాలి.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..