Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో జ్వరం, డయేరియాతో బాధపడ్డాను.. ఏదీ చూపించలేదు.. రమ్య మోక్ష..

బిగ్‌బాస్‌ సీజన్ 9లో అత్యధిక నెగిటివిటీతో బయటకు వచ్చింది అంటే రమ్య మోక్షనే. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన ఈ అమ్మడు.. కేవలం రెండు వారాలకే బయటకు వచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తనూజ, కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేయడం.. ఆ తర్వాత వారిద్దరి గురించి బ్యా్క్ బిచింగ్ చేయడంతో రమ్యపై నెగిటివిటీ వచ్చేసింది. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో జ్వరం, డయేరియాతో బాధపడ్డాను.. ఏదీ చూపించలేదు.. రమ్య మోక్ష..
Bigg Boss 9 Telugu

Updated on: Oct 30, 2025 | 6:47 PM

బిగ్‌బాస్‌ సీజన్ 9.. ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది. అయితే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలుగా ఆరుగురిని పంపించగా.. వారిలో ఆరోగ్యం బాగలేక బయటకు వెళ్లిపోయింది ఆయేషా. హౌస్ లో డెంగ్యూ , టైఫాయిడ్ కారణంగా ఇబ్బంది పడడంతో ఆమెను మధ్యలోనే బయటకు పంపించారు బిగ్ బాస్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రమ్య మోక్ష. హౌస్ లోకి వెళ్లడానికి ముందే ఈ అమ్మడు పై నెగిటివిటీ ఉన్న సంగతి తెలిసిందే. కానీ రమ్య మోక్ష బిగ్‌బాస్‌ లోకి ఎంట్రీ ఇవ్వడంపై విపరీతమైన బజ్ నెలకొంది. అయితే వెళ్లిన మొదటి రోజే తనూజ, కళ్యాణ్ గురించి మాట్లాడటం.. ఆ తర్వాత గొడవలు, అరుపులతో ఇంట్లో నానా హంగామా చేసింది. దీంతో రెండు వారాలకే బయటకు వచ్చింది. గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రమ్య మోక్ష.. మొదటిసారి బిగ్‌బాస్‌ గురించి ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. తాను బిగ్‌బాస్‌ హౌస్ లో అనారోగ్యంతో బాధపడ్డానని.. అవేవి షోలో చూపించలేదని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

రమ్య ఇన్ స్టా పోస్టులో.. ” నా లుక్స్ పై కామెంట్స్ చేస్తూ మీమ్స్ చేశారు.. వాటిలో కొన్ని మాత్రమే చూశాను. నాకు థైరాయిడ్ ఉంది. బిగ్‌బాస్‌ కోసం డైట్ స్కిప్ చేశాను. టాన్సిల్స్ కావడంతో గొంతు కింద దవడ ఉబ్బిపోయింది. ఆకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చి అక్కడి వాటర్ తాగేసరికి మరింత ఇబ్బందిపడ్డాను. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి.. చేతులు, మెడ , శరీరమంతా రాషెస్ వచ్చాయ. కేవలం నీళ్ల వల్లే ఈ ప్రాబ్లమ్ ఎదురైంది. జంక్ ఫుడ్ తిని సోడా తాగడంతో హౌస్ లో విపరీతమైన జ్వరం వచ్చింది. డయేరియాతో బాధపడ్డాను. నా అనారోగ్య సమస్యలను టీవీలో చూపించలేదు. అసలు బిగ్‌బాస్‌ హౌస్ లో ఏం జరిగింది అనేది త్వరలోనే వీడియో చేసి వివరంగా చెప్తాను. నేను ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యలను నుంచి కోలుకుంటున్నాను. టీవీలో నేను చబ్బీగా కనిపించాను. దీంతో నా లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను లావుగా ఉండను.. మేకప్ అసలు వేసుకోను.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

మేకప్ వేసుకుంటే నా కళ్లు ఎర్రబడి, నీళ్లు కారతాయి. అలాగే జలుబు, తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే నేను మేకప్ వేసుకోను. నా గురించి వచ్చే నెగిటివిటీని నేను అస్సలు పట్టించుకోను.. వాటిని ఎలా గాలికొదిలేయాలో నాకు తెలుసు ” అంటూ రమ్య తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..