Bigg Boss 9 Telugu : తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్.. చిట్టా బయటపెట్టిన భరణి.. ఇప్పుడేం లాభం భయ్యా..

కళ్యాణ్ పడాల.. మొన్నటి వరకు టైటిల్ రేసులో దూసుకోచ్చిన పేరు. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రవర్తన, ఆట తీరుతో అదరగొట్టారు. దీంతో ఈసారి సీజన్ విన్నర్ అతడే అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలకు చెల్లు పెట్టేశాడు కళ్యాణ్. తన ఆట మొత్తాన్ని తనూజకే త్యాగం చేస్తున్నాడు. ఆమె ఎలా చెబితే అలా ఆడేస్తూ టైటిల్ కు దూరమైపోతున్నాడని అంటున్నారు.

Bigg Boss 9 Telugu : తనూజ చేతిలో కీలుబొమ్మగా కళ్యాణ్.. చిట్టా బయటపెట్టిన భరణి.. ఇప్పుడేం లాభం భయ్యా..
Thanuja

Updated on: Dec 10, 2025 | 1:32 PM

బిగ్ బాస్ సీజన్ 9లో ముందు నుంచి విన్నర్ రేసులో జోరుగా వినిపిస్తుంచి పేరు తనూజ. కానీ గత నాలుగైదు వారాలుగా అనుహ్యంగా కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది. మొదట నాలుగైదు వారాలు నెగిటివిటీ మూట గట్టుకున్న కళ్యాణ్.. తర్వాత తన ప్రవర్తన, ఆట తీరుతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో అత్యధిక ఓటింగ్ తో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. అయత ఇప్పుడు కళ్యాణ్ ఆట గతితప్పినట్లుగా తెలుస్తోంది. ఈసారి ఆర్మీ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకుంటే తనూజ చేతిలో కీలుబొమ్మ అయ్యాడంటూ నెటిజన్స్ అంటున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలోనూ భరణి ఇదే విషయాన్ని బయటపెట్టాడు. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ .. ఇప్పుడు తనూజ చెప్పినట్లు వింటున్నాడు. ప్రస్తుతం హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేందుకు వరుస టాస్కులు పెడుతున్నారు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

లీడర్ బోర్డులో తక్కువ ఓటింగ్ రావడంతో సంజన ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం డీమాన్, ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి పోటీ పడుతున్నారు. ఒక్కో కంటెస్టెంట్స్ జంబూ ప్యాంట్ ధరించి కదులుతూ సంచాలకులు విసిరే బాల్స్ ఒడిసిపట్టుకోవాలని టాస్క్ ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ ను సేకరిస్తారో వాళ్లకు ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. అయితే ఇందులో సంజన, కళ్యాణ్ సంచాలక్ గా వ్యవహింంచారు. మొదట సంజన బాల్స్ వేయగా.. ఒక్కో కంటెస్టెంట్ బాల్స్ అందుకున్నారు. ఎప్పటిలాగే ఆమె ఇమ్మూ ఎక్కువ బాల్స్ విసిరింది. ఇక తర్వాత కళ్యాణ్ ఎలాగు తనూజ విన్ కావాలని కోరుకుంటాడు కాబట్టి.. ఎక్కువ బాల్స్ ఆమెకే విసిరాడు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత సుమన్ శెట్టికి వేయగా.. అతడికి అడ్డుపడి మరీ భరణి బాల్స్ అందుకున్నాడు. దీంతో అన్నా మీరు మరీ ఇటు అడ్డొచ్చి ఆడుతున్నారని చెప్పాడు. సుమన్ అన్న హైట్ తక్కువగా ఉన్నాడు కదా.. అతడికి ఎక్కువ వేస్తే ఏం పోతుంది అని సంజన నిలదీయగా.. సుమన్ అన్నకు వేస్తుంటే భరణి గారు అందుకుంటున్నారు అని చెప్పాడు కళ్యాణ్. దీంతో హైట్ గురించి భరణి లాజిక్స్ మాట్లాడాడు. ఇక ఎప్పటిలాగే తనస్టైల్లో వాదించింది తనూజ.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

చివరగా.. భరణి మాట్లాడుతూ.. “కళ్యాణ్ ఏంటీ.. ఇంత దారుణంగా అయిపోయాడు. తనూజ కూర్చోమంటే కూర్చొంటున్నాడు.. నిలబడు అంటే నిలబడుతున్నాడు. కళ్యాణ్ పై తనూజ కమాండింగ్ ఎక్కువగా అనిపిస్తుంది” అని అన్నాడు. భరణి అనడం కాదు కానీ కళ్యాణ్ మాత్రం తన ఆటను తనూజ కోసం పక్కన పెట్టేశాడు. ఎలాగైనా తనూజ గెలవాలనే ప్రయత్నిస్తున్నాడు. దీంతో అతడు బిగ్ బాస్ టైటిల్ కు దూరమవుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..