
బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. అయితే ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకు తగినట్లుగానే ఆమె ఫ్యాన్స్, పీఆర్ టీమ్స్ ఎక్కువగానే కష్టపడుతున్నారు. మరవైపు తనూజకు నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంది. మొదటి నుంచి ఆమె ఏం చేసిన అటు బిగ్ బాస్.. ఇటు హోస్ట్ నాగార్జున ఏం అనకుండా సపోర్ట్ చేయడం.. ఆమెకు ఫుటేజీ ఎక్కువగా ఇవ్వడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సీజన్ మొత్తంలో అత్యధిక స్క్రీన్ స్పేస్ కంటెస్టెంట్ అంటే తనూజ అని విమర్శలు కూడా వస్తున్నాయి. తనూజ మాట మార్చడం.. ఆమె కన్నింగ్ గేమ్ గురించి వీడియోస్ షేర్ చేస్తూ మరీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
ఇక నిన్నటి ఎపిసోడ్ లో తనూజ, దివ్య మధ్య గట్టిగానే గొడవ జరిగింది. తనను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించడంతో సీరియస్ అయ్యింది తనూజ. పర్సనల్ రీజన్స్ అంటూ తనూజ నోరు జారడంతో గట్టిగానే కౌంటరిచ్చింది దివ్య. ఇద్దరూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో హౌస్మేట్స్ ఇద్దరిని దూరంగా తీసుకెళ్లారు. ఇప్పుడు వీరిద్దరి గొడవకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ ఎవరీ ఫ్యాన్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షోపై కాంగ్రెస్ సీనియర్ లీడ్.. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సైతం స్పందించారు.
బిగ్ బాస్ షో గురించి పోస్ట్ చేస్తూ.. తనూజ గురించి ప్రస్తావించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తనూజ ఆట తీరును అంచనా వేసిన హర్షకుమార్ “తనూజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయింది” అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు హర్షకుమార్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..