Bigg Boss 9 Telugu: క్లోజ్‌గా ఉండటంలో ఎలాంటి తప్పులేదు.. సంజన అలా అడగడం అన్యాయం.. రీతూకు సపోర్ట్‌గా అఖిల్ సార్థక్..
బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి వారం నుంచి అంత ఆసక్తిగా సాగలేదు. బంధాలు, అనుబంధాలు అంటూ సాగదీతతోనే నెట్టుకొచ్చింది. కానీ 12వ వారం జరిగిన నామినేషన్స్ మాత్రం పెద్ద రచ్చే చేశాయి. డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకోవడం..రీతూ పై సంజన కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యాయి. రీతూ గురించి సంజన చేసిన వ్యాఖ్యలపై మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ స్పందించారు.

బిగ్‌బాస్ సీజన్ 9.. మరికొన్ని వారాల్లో ముగియనుంది. ఈక్రమంలోనే 12వ వారం జరిగిన నామినేషన్స్ మాత్రం పెద్ద రచ్చ చేసాయి. కళ్యాణ్, డీమాన్ బీభత్సమైన గొడవ.. ఆ తర్వాత సంజన, రీతూ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అదే కోపంలో రీతూపై నోరు జారింది సంజన. రోజూ రాత్రైతే డీమాన్ పక్కన కూర్చొంటావ్.. నేను చూడలేకపోతున్నా అంటూ మాటలు వదిలింది. దీంతో హౌస్మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే సంజనపై ఇమ్మాన్యుయేల్ సీరియస్ అయ్యారు. ఒక ఆడపిల్లను ఆ మాట ఎలా అంటావ్. తప్పు అంటూ సంజనపై మండిపడ్డారు. తన గురించి సంజన చేసిన వ్యాఖ్యలపై రీతూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..
రీతూపై సంజన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆడపిల్ల క్యారెక్టర్ తప్పుపట్టేలా సంజన మాట్లాడిందంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ సైతం సంజన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యాడు. ఒక ఆడపిల్ల గురించి అలాంటి కామెంట్స్ చేయడం నచ్చలేదన్నారు. “రీతూపై సంజన గారు చేసిన కామెంట్స్ నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. హద్దులు దాటి అనవసరమైన , మిస్ లీడింగ్ కామెంట్స్ చేశారు. మొదటి నుంచి ఇప్పటివరకు రీతూ తన గౌరవాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఆమె ఎప్పుడూ డీమాన్ తో హద్దులు దాటలేదు. ” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..
“ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరగా కూర్చోవడం.. ఫ్రెండ్షిప్ చేయడాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు. అలా ఆలోచిస్తే ఆమె ఔట్ డేటెడ్ మైండ్ సెట్ అనాల్సిందే. ఒకవేళ హద్దులు దాటుంటే నాగార్జున సార్ ఎప్పుడో మాట్లాడేవారు. జనాలు కూడా వాళ్లకు సపోర్ట్ చేయరు. ఆడపిల్ల మీద ఇలాంటి కామెంట్స్ చేసి మళ్లీ ఎందుకు ఏడుస్తుందని అడగడం అన్యాయం. రీతూ ఏడుస్తుందంటే తన బాధను చెప్పడానికే.. కానీ సింపథి కోసం కాదు. బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే అమ్మాయి చేతిలోచేయి వేసి మాట్లాడడం, క్లోజ్ గా ఉండడం తప్పు కాదు. రీతూ ఏంటో జనాలకు తెలుసు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..




