Bigg Boss 9 Telugu: ఫ్యామిలీ వీక్ దెబ్బ.. బిగ్‌బాస్ టైటిల్ రేసులో కళ్యాణ్.. తనూజకు ఊహించని షాక్..
బిగ్‌బాస్ సీజన్ 9.. కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ అనే థీమ్ తో మొదలైంది. మొత్తం 6గురు కామనర్స్ ఎంట్రీ ఇవ్వగా.. తొమ్మిది మంది సెలబ్రెటీస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దివ్య మధ్యలోనే హౌస్ లోకి రాగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో మరో ఆరుగురిని తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ తుది దశకు చేరుకుంది.

బిగ్‌బాస్ సీజన్ 9.. మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దీంతో ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మొదటి నుంచి టైటిల్ విజేత బిగ్‌బాస్ ముద్దుబిడ్డ తనూజ పేరు వినిపిస్తుండగా.. బయట సైతం ఆమె పేరు మారుమోగుతుంది. మొదటి నుంచి తనూజ పీఆర్ టీమ్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరోవైపు సీరియల్ అభిమానులు సైతం తనూజకు సపోర్ట్ చేస్తుండడంతో ఆమెనే ఈసారి విన్నర్ అనే ప్రచారం మొదలైంది. అయితే తనూజకు నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంది. ఆమెకు హోస్ట్ నాగార్జున.. బిగ్‌బాస్ టీమ్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారంటూ ముందు నుంచి వినిపిస్తున్న వాదన. సీజన్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటికీ తనూజ తప్పు చేసినా ప్రశ్నించినవారు లేరంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. గతవారం హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఎంతో భావోద్వేగంగా సాగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కళ్యాణ్, డీమాన్ ఫ్యామిలీలతోపాటు భరణి కూతురు రావడం ఆ వీక్ మొత్తానికి హైలెట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ 12వ వారం నామినేషన్స్ మరింత హీట్ గా సాగిన సంగతి తెలిసిందే. కళ్యాణ్, డీమాన్, సంజన ముగ్గురికి రెడ్ కార్డ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ వారం ఓటింగ్ ఉత్కంఠ రేపుతుంది. టైటిల్ విన్నర్ రేసులో కళ్యాణ్, తనూజ నువ్వా నేనా అని పోటీపడుతున్నారు.
వీరిద్దరి మధ్య గట్టిపోటీ నెలకొంది. తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ 35 శాతం ఓటింగ్ వస్తుంది. మొన్నటివరకు అత్యధిక ఓటింగ్ తో తనూజ టాప్ లో ఉంటగా.. ఇప్పుడు మాత్రం కళ్యాణ్ దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒకటి రెండు శాతమే ఉంటుంది. దీంతో వీరిద్దరిలోనే విన్నర్ ఒకరు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మిగిలిన కంటెస్టెంట్లలో ఇమ్మూ, భరణి, సుమన్ శెట్టికి ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. చివరగా రీతూ, సంజన, డీమాన్, దివ్యకు అతి తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
