Bigg Boss 8 Telugu: పొట్టి పిల్ల గట్టిగానే.. బిగ్ బాస్ ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?

|

Oct 07, 2024 | 6:48 AM

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లిపోయాడు. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది.

Bigg Boss 8 Telugu: పొట్టి పిల్ల గట్టిగానే.. బిగ్ బాస్ ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?
Nainika Anasuru
Follow us on

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8లో మరో వారం పూర్తయ్యింది. సెప్టెంబర్ 1న అట్టహాసంగా మొదలైన ఈ టీవీ రియాలిటీ షోలో ఇప్పటికే ఐదు వారాలు గడిచిపోయాయి. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఐదు వారాల్లో ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఆదిత్య ఓం బయటకు వెళ్లిపోయాడు. ఇక వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది. షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది. టాస్కుల్లో యాక్టివ్ గా పార్టి సిపేట్ చేసింది. ముఖ్యంగా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగేందుకు నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక.. ఆ తర్వాత ఎందుకో పూర్తిగా స్లో అయిపోయింది. క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆటలోనూ నిరుత్సాహపరిచింది. స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోయింది. నైనిక ఆట తీరును చూసి నాగార్జున ఆశ్చర్యపోయాడు. ‘ నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది’ అని ఆమె ముఖం మీదే అడగడం నైనిక ఆట తీరుకు అద్దం పడుతుంది.

ఈ క్రమంలోనే ఐదో వారం నామినేషన్స్ లో నిలిచింది నైనిక. ఆడియెన్స్ కూడా ఆమెను హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకున్నారు. ఫలితంగా ఓటింగ్ లో తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా చాలా మంది ఊహించినట్లే నైనిక ఎలిమినేట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఐదు వారాలకు గట్టిగానే..

 

ఇక ఈ పొట్టి పిల్ల రెమ్యునరేషన్ విషయానికి వస్తే మిగతా కంటెస్టెంట్స్ కంటే బాగానే అందుకున్నట్లు తెలుస్తోంది. వారానికి రూ.2.20 లక్షల లెక్కన మొత్తం ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకుందట నైనిక.

బిగ్ బాస్ బజ్ లో నైనిక ఏం చెప్పిందో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.