Bigg Boss 8 Telugu: చల్లారని నామినేషన్స్ చిచ్చు.. కన్నీళ్లు పెట్టుకున్న యష్మీ.. సోనియా నవ్వులు.. ప్రోమో చూశారా..

|

Sep 24, 2024 | 1:47 PM

దీంతో ఇది గ్రూప్ గేమ్ అంటూ బిగ్‏బాస్ కే కంప్లైయింట్ చేశాడు నబీల్. ఇక సోమవారమే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కానీ ఆ సమయంలో మొదలైన రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, నైనిక, సోనియా, నబీల్, పృథ్వీ నామినేట్ అయ్యారు. కానీ చీఫ్ అయిన కారణంగా నిఖిల్ ఒకరిని సేవ్ చేయాలని బిగ్‏బాస్ ఆదేశించగా.. తెలివిగా నైనికను సేవ్ చేశాడు నిఖిల్.

Bigg Boss 8 Telugu: చల్లారని నామినేషన్స్ చిచ్చు.. కన్నీళ్లు పెట్టుకున్న యష్మీ.. సోనియా నవ్వులు.. ప్రోమో చూశారా..
Bigg Boss 8 Telugu Promo
Follow us on

బిగ్‏బాస్ నాలుగో వారం నామినేషన్స్ రచ్చ మాములుగా జరగలేదు. ఒక్కొక్కరు నువ్వా నేనా అన్న రేంజ్‏లో గొడవ పడ్డారు. ముఖ్యంగా యష్మీ వర్సెస్ సోనియా, నబీల్ వర్సెస్ సోనియా మధ్య డిస్కషన్ హీటెక్కించేసింది. ఇక సోనియా నామినేట్ చేస్తూ నబీల్ మాట్లాడుతుండగా.. నిఖిల్, పృథ్వీ ఇద్దరు తమ స్నేహితురాలి కోసం మధ్యలోకి వచ్చేశారు. సోనియాకు సపోర్ట్ చేస్తూ నబీల్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఇది గ్రూప్ గేమ్ అంటూ బిగ్‏బాస్ కే కంప్లైయింట్ చేశాడు నబీల్. ఇక సోమవారమే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. కానీ ఆ సమయంలో మొదలైన రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, నైనిక, సోనియా, నబీల్, పృథ్వీ నామినేట్ అయ్యారు. కానీ చీఫ్ అయిన కారణంగా నిఖిల్ ఒకరిని సేవ్ చేయాలని బిగ్‏బాస్ ఆదేశించగా.. తెలివిగా నైనికను సేవ్ చేశాడు నిఖిల్.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మీ, సోనియా మధ్య గొడవ ఇంకా తగ్గినట్లు లేదు. ప్రోమో స్టార్ట్ కాగానే.. పృథ్వీ పై ఫైర్ అయ్యింది యష్మీ. నువ్వు మదర్, సిస్టర్ అంటే నేను ఎందుకు నమ్ముతాను.. అది కరెక్ట్ కాదు. అలా తీయకూడదు.. అంటే మీరిద్దరూ పేరు తీసి దానికి ఏదైనా అటాచ్మెంట్ యాడ్ చేయ్యొచ్చా అంటూ ప్రశ్నించింది యష్మీ. దీంతో మధ్యలోకి సోనియా వచ్చేసి యష్మీపై ఫైర్ అయ్యింది.

నేను అంత క్లియర్ గా చెప్పాను కదా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా.. ‘నేను గేమ్ పరంగా చూశానమ్మా.. హాలో నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ అటాచ్ చేసి నేను సిస్టర్ ను, మదర్ ను అని ఇష్టం వచ్చినట్లు వాళ్లను వాడుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లా్న్ లో ఎవరికీ ఇవ్వలేదు నాన్సెస్’ అంటూ సీరియస్ అయ్యింది యష్మీ. నీ ఫోకస్ మొత్తం వాళ్లిద్దరి మీదనే ఉంది కదా అంటూ, నన్ను ఎప్పుడూ చూస్తలేవు కదా సోనియా ఏదేదో చెప్తుండగా.. నెక్ట్స్ టైమ్ నువ్వు నన్ను చూడు.. నేను పృథ్వీని చూస్తున్నానా.. నిఖిల్ ను చూస్తున్నానా.. లేక గేమ్ ఆడుతున్నానా.. నెక్ట్స్ నామినేషన్స్ లో చూడు అంటూ యష్మీ సీరియస్ అయ్యింది. దీంతో సోనియా నవ్వుతూ కనిపించింది. తను చేస్తే నామినేషన్స్.. మేము చేస్తే కాదు.. ప్రతిసారి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటుంది.. నువ్వు నాతో మాట్లాడినప్పుడు అంటూ నిఖిల్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది యష్మీ. దీంతో నిఖిల్, సీత ఆమెను ఓదార్చారు.

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ ప్రోమో.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.