బిగ్బాస్ సీజన్ 8లో ఊహించని ట్విస్టులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు నాగార్జున. అంటే ఈరోజు బుధవారం మరో ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఈవారం మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, నైనిక, ఆదిత్య ఓం నామినేట్ కాగా.. వీరిలో అందరి కంటే ఎక్కువ ఓటింగ్ తో సత్తా చాటుతున్నాడు నబీల్. ఇప్పటివరకు జరిగిన అన్ని టాస్కులలో అదరగొట్టేస్తున్నాడు.. అలాగే నామినేషన్స్ టైంలో నబీల్ చెప్పే పాయింట్స్ కరెక్టుగా అడియన్స్ అంచనాలకు సింక్ అవుతున్నాయి. దీంతో మిగతా కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ ఓట్లతో మెజారిటీతో దూసుకుపోతున్నాడు. ఇక ఆ తర్వాత నిఖిల్ అత్యధిక ఓటింగ్ సంపాదించుకుంటున్నాడు. సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ప్రవర్తన, ఆట తీరులో చాలా మార్పు వచ్చిందనేది అడియన్స్ గమనిస్తున్న విషయమే.
నబీల్, నిఖిల్ తర్వాత మూడో స్థానంలో మణికంఠ కొనసాగుతున్నాడు. హౌస్ మొత్తం అతడినే టార్గెట్ చేయడం.. ప్రతి టాస్కులో అతడిని అనర్హుడు అంటూ తప్పించడంతో ఇటు అడియన్స్ మద్దతు పెరిగిపోతుంది. మణి తర్వాత నాలుగో స్థానంలో విష్ణుప్రియ ఉండగా..ఐదో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు ఇప్పటివరకు సోషల్ మీడియా ఓటింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇక చివరగా నైనిక అతి తక్కువ ఓటింగ్ తో నెట్టుకోస్తుంది. ప్రస్తుతం ఆదిత్య ఓం, నైనిక ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అలాగే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను సీక్రెట్ రూంకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే నైనిక , ఆదిత్య ఓం ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అడియన్స్ ఓటింగ్ కాకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ఇంట్లో అర్హత లేని సభ్యుడిని ఎలిమినేట్ చేయాలంటూ కంటెస్టెంట్స్ నిర్ణయం అడిగితే అందరూ కచ్చితంగా మణికంఠ పేరు చెప్పడం ఖాయం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు టాస్కులలో జరుగుతున్న పర్ఫామెన్స్ బట్టి ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు అని అడిగితే అనర్హుడిగా అందరూ మణి పేరు చెప్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. యష్మీ, నిఖిల్, పృథ్వీ వీరు ముగ్గురు మణి పేరు చెప్తారు.. ఇక తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే సీత, నైనిక కూడా మణి చెప్తారని తెలుస్తోంది. దీంతో ఎక్కువ కంటెస్టెంట్స్ మణి పేరు చెప్పడంతో అతడిని మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సీక్రెట్ రూంకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మణికంఠ కారణంగా బిగ్బాస్ కు కావాల్సినంత ఫుటేజ్ వస్తుంది. అలాగే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండనున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.