బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి పేరున్న కంటెస్టెంట్స్ పెద్దగా లేకపోయినా ఆడియెన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తారు. ముఖ్యంగా టాస్కులు, గేమ్స్ లో తమను తాము నిరూపించుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ పై కూడా విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో మాటలు హద్దులు దాటడంతో కొందరు కంటెస్టెంట్స్ చిన్న బుచ్చుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక హౌస్ లో మొదటి నుంచి సింపతీ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ మణికంఠ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో బోరుమన్నాడు. కోడి గుడ్ల టాస్క్ లో భాగంగా తనను ఆట నుంచి ఎలిమినేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు నాగ మణికంట. ఒక మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. ఇది గమనించిన అభయ్ నవీన్ మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే నాగ మణికంఠ మాత్రం ఏడుపు ఆపలేదు.. ‘ నా పెళ్లాం బిడ్డలు దక్కాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి. బిగ్ బాస్ టైటిల్ గెలవాలి’ అని మరింత ఎమోషనల్ అయ్యాడు.
‘ మణి.. నిన్ను నమ్ముకుని బయట ఇద్దరున్నారు’ అని అభయ్ చెబుతున్నా ఏడుపు ఆపలేదు మణికంఠ.. ‘ నాకు ఎవరూ లేరు, వాళ్లు నా లైఫ్‌లోకి రావాలంటే షో గెలవాలి’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. తాజాగా రిలీజైన బిగ్ బాస్ ప్రోమోలో ఇదే వెల్లడైంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం నుంచే మణికంఠపై సింపతీ కార్డ్ ప్లేయర్ అంటూ ముద్ర పడిపోయింది. ప్రతిసారీ తన ఫ్యామిలీ గురించి చెప్పి ఏడుస్తున్నారు. అలాగే భార్య బిడ్డల ప్రస్తావన తెచ్చి ఎమోషనల్ అవుతున్నాడు. అయితే దీనిని చూసిన ఆడియెన్స్ చిర్రెత్తి పోతున్నారు. పర్సనల్స్, గేమ్ రెండూ వేర్వరంటూ హితవు పలుకుతున్నారు.
🥚🔥 The Egg Hunt takes a wild turn‼️😳 Contestants are caught stealing each other’s eggs—who will outsmart whom in this game of tricks and survival? #BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/90K5hJz2NY
— Starmaa (@StarMaa) September 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.