బిగ్ బాస్ హౌస్ నుంచి ఊహించని రీతిలో బయటకు వచ్చేశాడు శేఖర్ బాషా. తన ఆట, మాట తీరు చూస్తుంటే చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటాడనిపిస్తోంది. కానీ బిగ్ బాస్ పెట్టిన తల తిక్క రూల్ కారణంగా రెండో వారమే శేఖర్ బాషా బయటకు వచ్చేశాడు. దీనిపై అతని అభిమానులు ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా శేఖర్ బాషాని అన్యాయంగా బయటకు పంపారని ఆడియన్స్ భావిస్తున్నా.. అతను మాత్రం ఇష్టపూర్వకంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడంటున్నారు చాలా మంది. తన భార్య డెలివరీ కావడం ఒక కారణం అయితే.. బిగ్ బాస్ హౌస్‌లో అతనొక్కడే వెజిటేరియన్ కావడంతో ఫుడ్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. దీంతో హౌస్‌లో ఉండలేనని బిగ్ బాస్‌కి మొరపెట్టుకోవడంతో రెండో వారమే అతన్ని బయటకు పంపించారని టాక్ నడుస్తోంది. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా ఫుల్ బిజీ గా మారాపోయాడు. ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నప్పటికీ ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదట. దీంతో బిగ్ బాస్‌కి వెళ్లొచ్చిన తరువాత బాషాకు పొగరు పెరిగింది అని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో వివరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు శేఖర్ బాషా.
‘బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదీ నా పరిస్థితి. కనీసం హెయిర్ కట్, ట్రిమ్మింగ్ చేసుకునే సమయం కూడా దొరకడం లేదు. రాత్రి పగలూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాను. మీ అందరికీ తెలుసు.. నా భార్యకి డెలివరీ అయ్యింది.. ఆమె ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. చాలామంది మీడియా మిత్రులు ఇంటర్వ్యూల కోసం నాకు ఫోన్లు చేస్తున్నారు. అలాగే విష్ చేయడానికి కూడా కాల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చాలా వరకూ కాల్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను”
‘ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినంత మాత్రాన తప్పుగా అనుకోవద్దు. వీడికి బిగ్ బాస్‌కి వెళ్లాక ఒళ్లు పొగరు పెరిగిపోయిందని భావించొద్దు. ఒక్క రెండు రోజులు నాకు టైమ్ ఇవ్వండి. అన్నీ సెట్ అయ్యాక నేనే మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఈ గడ్డం, జుట్టుతో ఇలాగే వెళ్తే జనాలు కూడా పారిపోయే ప్రమాదం కూడా ఉంది. కాస్త నీట్‌గా రెడీ అయ్యి త్వరలోనే జనజీవన స్రవంతిలో కలుస్తాను’ అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.