Bigg Boss 8 Telugu: లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. ప్రభాకర్, ఆమని ముందు నిఖిల్ ప్రేమకథ.. అవినాష్‏ను ఓ ఆటాడుకున్న బిగ్‏బాస్..

|

Dec 10, 2024 | 6:50 AM

బిగ్‏బాస్ సీజన్ 8లో నామినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం 5గురు ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. చివరి వారం కావడంతో హౌస్మేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చివరి వారంలోనూ అతిథుల రాకతోపాటు.. ఫ్రైజ్ మనీ మరింత పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్.

Bigg Boss 8 Telugu: లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. ప్రభాకర్, ఆమని ముందు నిఖిల్ ప్రేమకథ.. అవినాష్‏ను ఓ ఆటాడుకున్న బిగ్‏బాస్..
Bigg Boss 8 Telugu
Follow us on

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి సీరియల్ సెలబ్రెటీస్ వచ్చారు. మొన్న ఓంకార్ వచ్చి ఇస్మార్ట్ సీజన్ 3 షో గురించి ప్రమోట్ చేయగా.. ఇప్పుడు కొత్త సీరియల్ నువ్వుంటే నా జతగా హీరోహీరోయిన్స్ అర్జున్ కళ్యాణ్, అనుమిత హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే తమ సీరియల్ ప్రమోషన్స్ కోసం వచ్చిన ఈ జంటకు గేమ్ అంటూ చుక్కలు చూపించాడు బిగ్ బాస్. మా పరివారం వర్సెస్ బీబీ పరివారం మధ్య జరిగే టాస్కులలో గెలిచి విన్నర్ ప్రైజ్ మనీని పెంచుకోవచ్చని చెప్పాడు బిగ్ బాస్. ఒకరు డ్రమ్ లో పడుకొని ఉంటే మరొకరు దొర్లించుకుని వేరే చివరకు తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న వస్తువులను వాళ్లు పట్టుకుని ఇటువైపు దొర్లించాలి. ఇక ఈ గేమ్ అసలు ఊహించని హీరోయిన్.. డ్రమ్ లో ఒక్కసారి దోర్లించేసరికి బయటకు వచ్చేసింది. ఈ టాస్కులో బీబీ పరివారం గెలిచి విన్నర్ ప్రైజ్ మనీకి రూ.12000 యాడ్ చేసింది.

ఇక ఆ తర్వాత సీరియల్ టీం వెళ్లిపోయిన తర్వాత హౌస్మేట్స్ దాగుడుమూతలు ఆడుకున్నారు. ఈ ఆటలో అవినాష్ ను ఓ ఆటాడుకున్నాడు బిగ్ బాస్. అవినాష్ బయటకు వద్దామంటే డోర్ లాక్ చేసి ఇరికించేశాడు. తలుపు తీయమని కెమెరాకు వేడుకున్నప్పటికీ డోర్ ఓపెన్ చేయకుండా లైట్స్ ఆపేసి.. వింత వింత సౌండ్స్ చేసి భయపెట్టాడు. దీంతో దండం పెట్టేశాడు అవినాష్. ఇదంతా టీవీలో చూసి తెగ నవ్వుకున్నారు హౌస్మేట్స్. ఆ తర్వాత ప్రభాకర్, ఆమని హౌస్ లోకి వచ్చారు. తమ కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ గురించి చెప్పారు. ఆ తర్వాత అందరితో మాట్లాడారు.

నిఖిల్ ప్రేమ పెళ్లా.. లేక అరెంజ్డ్ మ్యారేజా అని ప్రభాకర్ అడకర్ అడగ్గా.. లవ్ మ్యారేజ్ ఇష్టమని అన్నాడు నిఖిల్. ఎందుకు అంటూ ప్రభాకర్ అడగ్గా.. ఇష్టం దానికి రీజన్ ఏం లేదని.. లవ్ అంటే ఆ పర్సన్ తో ట్రావెల్ చేస్తాం.. అర్థం చేసుకుంటామని చెప్పుకొచ్చాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేదా అని ప్రభాకర్ అడిగితే ప్రేమ పెళ్లి అయినా ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటా అంటూ మళ్లీ క్లారిటీ ఇచ్చాడు నిఖిల్. ఇదివరకు సీరియల్ నటి కావ్యతో నిఖిల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలోకి వచ్చే ముందు ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. అయితే హౌస్ లోకి వచ్చాక నిఖిల్ ప్రవర్తన పై కావ్య ఇదివరకే నెట్టింట పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.