Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ సీజన్ 7లోకి వెళ్లినవారు వీరే.. ఎవరెవరు తప్పుకున్నారంటే..

|

Sep 03, 2023 | 7:00 AM

టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ అందులో ఎవరెవరు వెళ్లనున్నారనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. గతంలో సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతోనే సీజన్ 7పై ఆసక్తిని కలిగించారు. అలాగే కుడిఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ఈసారి బిగ్‏బాస్ షోలో మార్పులు కాస్త ఎక్కువగానే చేసినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ సీజన్ 7లోకి వెళ్లినవారు వీరే.. ఎవరెవరు తప్పుకున్నారంటే..
Bigg Boss 7 Telugu
Follow us on

బుల్లితెరపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 7 మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్న కంటెస్టెంట్స్ లిస్ట్ కు సంబంధించిన అనేక పేర్లు బయటకు వచ్చాయి. అందులో టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ అందులో ఎవరెవరు వెళ్లనున్నారనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. గతంలో సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతోనే సీజన్ 7పై ఆసక్తిని కలిగించారు. అలాగే కుడిఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ఈసారి బిగ్‏బాస్ షోలో మార్పులు కాస్త ఎక్కువగానే చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు విడుదలైన ప్రోమోలను చూస్తుంటే.. గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా చూసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈసారి షోను పూర్తిగా మార్చేసి ప్రేక్షకులు కొత్తదనం చూపించబోతున్నారనే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసి ఇంట్లోకి పంపించారట. మొత్తానికి మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే బిగ్‏బాస్ ఇంట్లోకి ఎవరెవరు అడుగుపెట్టారు… ఈసారి హౌస్ లో మొత్తం 20 మంది ఉన్నారట..మరి వారెవరో తెలుసుకుందామా. ఇక ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం..

ఇవి కూడా చదవండి

1. బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి

2. ఆట సందీప్

3. కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి

4. మోడల్ ప్రిన్స్ యవర్ (నా పేరు మీనాక్షి ఫేమ్)

5. సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే.

6. సీరియల్ నటి ప్రియాంక జైన్.

7. సీరియల్ నటి శుభ శ్రీ

8. ఒకప్పటి హీరో శివాజీ

9. ఒకప్పటి హీరోయిన్ ఫర్జానా

10. షకీలా

11. నటుడు గౌతమ్ కృష్ణ (ఆకాశవీధిలో ఫేమ్)

12. జబర్దస్త్ నటుడు యూట్యూబ్ ఫేం తేజ. (టేస్టీ తేజ)

13. మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి.

14. పల్లవి ప్రశాంత్ (కామన్ మాన్)

వీరంతా ఇప్పటివరకు హౌస్‏లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక వీరు కాకుండా మరికొందరు కూడా ఇంట్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

16. సింగర్ దామినీ.

17. హీరోయిన్ రితిక నాయక్

18. ప్రభాకర్.

19. మహేష్ ఆచంట.

20. అర్జున్ అంబటి

21. ప్రభాకర్

22. అంజలి పవన్

ఇక వీరు ఇంట్లోకి వెళ్లాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ముందుగా అనుకున్నట్లు యాంకర్ నిఖిల్, పూజా మూర్తి ఇంట్లోకి వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పలు కారణాలతో కొందరు తప్పుకోవడంతో.. మరికొందరిని యాడ్ చేశారు. మొగలి రేకులు ఫేం సాగర్, యువ సామ్రాట్, అనిల్ గీలా, అన్షూరెడ్డి, మోహన భోగరాజు, జబర్దస్త్ నరేష్ వంటి వారు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.