Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌కు రూ. 20 లక్షల విలువైన ప్లాట్‌.. ఎవరిచ్చారంటే?

|

Dec 18, 2023 | 8:59 PM

బిగ్‌ బాస్ టైటిల్‌ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్ మొత్తం రూ. 35 లక్షల ప్రైజ్‌ మనీ సొంతం చేసుకున్నాడు. అలాగే ఖరీదైన డైమండ్ నెక్లెస్‌, మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో ఖరీదైన బహుమతి పల్లవి ప్రశాంత్‌ అందుకున్నట్లు తెలుస్తోంది

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌కు రూ. 20 లక్షల విలువైన ప్లాట్‌.. ఎవరిచ్చారంటే?
Pallavi Prashanth
Follow us on

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ పేరు మార్మోగిపోతోంది. బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేతగా నిలిచిన అతనికి ఎక్కడా వెళ్లినా సాదర స్వాగతం లభిస్తోంది. అభిమానులు పూలవర్షం కురిపిస్తూ రైతు బిడ్డకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామానికి చేరుకున్న పల్లవి ప్రశాంత్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. తనకు గిఫ్ట్‌ గా వచ్చిన కారులో స్వగ్రామానికి పయనమైన పల్లవి ప్రశాంత్‌ రోడ్డు వెంట అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. తన బిగ్‌ బాస్‌ టైటిల్‌ ట్రోఫీని చూపిస్తూ సిద్దిపేట జిల్లాలని కోల్గురు చేరుకున్నాడు. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్ టైటిల్‌ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్ మొత్తం రూ. 35 లక్షల ప్రైజ్‌ మనీ సొంతం చేసుకున్నాడు. అలాగే ఖరీదైన డైమండ్ నెక్లెస్‌, మారుతి బ్రీజా కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. ఇప్పుడు వీటికి అదనంగా మరో ఖరీదైన బహుమతి పల్లవి ప్రశాంత్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. బిగ్‌ బాస్‌ షోలో విజేతగా నిలిచినందుకు గానూ ఎస్‌ ఆర్కే ఇన్‌ఫ్రా డెవపర్స్‌ సంస్థ ప్రతినిధులు రైతు బిడ్డకు రూ. 20 లక్షలు విలువ చేసే ప్లాట్‌ ని బహుమతిగా ప్రకటించారట. ‘యాదగిరిగుట్ట సమీపంలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కి ఒక ఖరీదైన ప్లాట్ ఇస్తున్నాం. దీని విలువ దాదాపు రూ.20 లక్షల వరకూ ఉంటుంది. ప్రశాంత్ మా స్నేహితుడే.. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏంటి? అనే వివరాలు త్వరలో చెప్తాం. మారుమూల ప్రాతం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్‌గా నిలవడం మాకు గర్వంగా ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచి, స్ఫూర్తిని పంచిన పల్లవి ప్రశాంత్‌కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సదరు సంస్థ తెలిపింది.

ఆదివారం (డిసెంబర్‌ 17) రాత్రి బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌ తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్, అమర్‌ దీప్‌ అభిమానులు పరస్పరం గొడవకు దిగడం, దాడులకు తెగపడ్డారు. అలాగే ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమోటోగా పల్లవి ప్రశాంత్‌ అభిమానులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

స్వగ్రామంలో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.