బిగ్‌బాస్ మూడో వారం ఎండింగ్‌కు వచ్చేసింది. సాధారణంగా వీకెండ్ అంటేనే హౌజ్‌మేట్స్‌పై హోస్ట్ నాగార్జున వేసే పంచులు, కౌంటర్లే గుర్తొస్తాయి. అయితే ఈవారం మాత్రం అలా జరగడం లేదనిపిస్తోంది. గత వారం రోజులుగా హౌజ్‌మేట్స్ ఆటతీరును నిశీతంగా పరిశీలిస్తున్న వీకెండ్ ఎపిసోడ్‌లో అందరికీ ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హౌజ్‌లో సీరియల్ బ్యాచ్ గా పేరొందిన అమర్ దీప్ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు నాగార్జున. అలాగే సంచాలక్ సందీప్‌ను కూడా ఓ ఆటాడేసుకున్నారు. నాగ్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కంటెస్టెంట్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ముందుగా అమర్‌దీప్‌తో మొదలెట్టాడు నాగ్. ముందు పెట్టిన గేమ్‌లో అమరదీప్ ఫెయిలయ్యాడు. దీంతో అతడు గేమ్ ఆడటానికి అనర్హుడని ప్రియాంక చెప్పింది. ఇదే విషయాన్ని పట్టుకుని అమర్‌దీప్‌ను కడిగేశాడు నాగ్ ‘ ప్రియాంక చెప్పిన పాయింట్ ను ఒప్పుకొంటున్నావా? అని అతనినే డైరెక్ట్‌గా అడిగేశారు. దీంతో అమర్ తల అడ్డంగా ఊపుతూ ‘నో’ అన్నాడు. మరి అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు హౌజ్‌లో బయటపెట్టలేదని నాగ్ ఫైర్ అయ్యారు. ‘అసలు నువ్వు నీకోసం గేమ్ ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?’ అంటూ అమర్‌దీప్‌కు ఇచ్చిపడేశారు నాగ్. దీనికి మాధానిమిస్తూ ‘నేను నాకోసమే గేమ్ ఆడుతున్నాను’ అని అమర్ చెప్పాడు. అదే సమయంలో ప్రశాంత్ పల్లవి టాపిక్‌ను మధ్యలోకి తీసుకొచ్చారు హోస్ట్.
ఇక శోభాశెట్టిపై కూడా ఓ రేంజులో ఫైర్ అయ్యారు నాగార్జున. ‘వీకెస్ట్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేయమన్నావ్? మరి.. ప్రిన్స్ యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి సైడ్ చేశావ్.. అంటే నువ్వు వీక్ కంటెస్టెంట్ అని అంగీకరించినట్టేనా?’ అని నాగ్ అడగ్గా శోభ నీళ్లు నమిలింది. ఇక హౌజ్‌లో సంచాలక్‌గా సందీప్ పూర్తిగా ఫెయిలయ్యాడని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గేమ్ మధ్యలో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నువ్వు ఎందుకు కంటెస్టెంట్స్‌కు పాయింట్స్ ఇస్తున్నావ్’ అని నాగ్ ప్రశ్నకు సందీప్ తెల్లమొహం వేశాడు. సంచాలక్‌గా సందీప్‌పై హౌజ్‌మేట్స్ ఓపినియన్స్‌ను తీసుకుని అతని బ్యాటరీ లెవెల్ గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించాడు. మొత్తానికి తాజాగా రిలీజైన ప్రోమో చూస్తుంటే వీకెండ్ ఎపిసోడ్‌లో మంచి హీట్ ఉండబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈరోజు జరుగుతుందో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.