బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ ఏడో సీజన్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్గా ఆరు సీజన్లు పూర్తి చేస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏడో సీజన్ ఆదివారం (సెప్టెంబర్ 3) సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ గా ప్రారంభం కానుంది. షో లాంఛింగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిగ్‌బాస్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి వరుసగా ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా తాజాగా రిలీజ్ చేసిన లాంచింగ్ ప్రోమో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోలుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి బిగ్ బాస్ లాంఛింగ్‌కు హాజరకానున్నారు. వీరితో నాగ్ సంభాషణలు అలరిస్తున్నాయి. కాగా ఈ ప్రోమోల్లోనే కంటెస్టెంట్లకు సంబంధించి కొద్దిగా హింట్ ఇచ్చారు నాగార్జున.
ముఖ్యంగా నిన్న సాయంత్రం విడుదలైన ప్రోమోలో రెడ్ శారీలో కనిపించిన అమ్మాయి కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టి అని గుర్తించవచ్చు. ఈ సీరియల్‌లో మోనిత అనే పాత్రలో నటించిన శోభా అదే పేరుతో బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇదే ప్రోమోల కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నది మోడల్ ప్రిన్స్ యావర్ అనిపిస్తోంది. నాపేరు మీనాక్షి వంటి సీరియల్స్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరలో ప్రిన్స్ నటించాడు. ఇక బ్లాక్ డ్రెస్‌లో కనిపించినది ప్రియాంక జైన్‌లా అనిపిస్తోంది.
వీరితో పాటు ప్రముఖ సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, హీరో శివాజీ, ఈటీవీ ప్రభాకర్, సింగర్ దామిని, పల్లవి ప్రశాంత్, టేస్టే తేజా, అర్జున్ అంబటి, హీరోయిన్ ఫర్హానా, అలాగే క్రీడాకారిణి ఐశ్వర్య, యాంకర్ నిఖిల్ తదితరులు బిగ్‌బాస్-7లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ మరికొన్ని గంటల్లో రానుంది. కాగా సాధారణంగా ఫినాలే రౌండ్‌లో కనిపించే బ్రీఫ్ కేస్ ఈసారి ఫస్ట్ ఫైవ్‌లోనే రానుంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు నాగ్. ప్రోమోల్లో ‘ఉల్టా పుల్టా’ అని నాగార్జున చెప్పినట్లు ఈ సీజన్‌లో భారీ మార్పులు ఉండనున్నాయని దీన్ని బట్టే తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.