Shobha Shetty: బిగ్‌ బాస్‌ బ్యూటీ ఊహించని సర్‌ప్రైజ్‌.. సీక్రెట్‌గా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శోభా శెట్టి.. వీడియో చూశారా?

| Edited By: Anil kumar poka

Jan 03, 2024 | 6:27 PM

ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో స్పై (శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌) బ్యాచ్‌తో సై అంటూ సై పోటీ పడింది. మాటకు మాట చెబుతూ చుక్కలు చూపించింది. అయితే అదే శోభకు నెగెటివిటీని తెప్పించింది.

Shobha Shetty: బిగ్‌ బాస్‌ బ్యూటీ ఊహించని సర్‌ప్రైజ్‌.. సీక్రెట్‌గా ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శోభా శెట్టి.. వీడియో చూశారా?
Shobha Shetty Engagement
Follow us on

శోభా శెట్టి.. కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌ బాస్ తో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. ఏడో సీజన్‌లో టాప్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో స్పై (శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌) బ్యాచ్‌తో సై అంటూ సై పోటీ పడింది. మాటకు మాట చెబుతూ చుక్కలు చూపించింది. అయితే అదే శోభకు నెగెటివిటీని తెప్పించింది. తన ప్రవర్తన శ్రుతిమించిందంటూ కామెంట్స్‌ వినిపించాయి. దీని ప్రభావం ఓటింగ్‌పైనా పడింది. ఫలితంగా గ్రాండ్‌ ఫినాలేకు చేరకుండానే బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ షోలోనే తన ప్రేమ, ప్రియుడి గురించి పంచుకుని అందరికీ షాక్‌ ఇచ్చింది శోభ. కార్తీక దీపం సీరియల్‌లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నానంది చెప్పడంతో ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు. తాజాగా తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసింది శోభ. దీనిని చూసిన వారందరూ షాక్‌ అవుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ టీవీ షో స్టేజ్‌పై శోభకు, యశ్వంత్‌కు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇద్దరూ పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్‌ ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అయితే ఒక టీవీ ప్రోగ్రాం కోసమే శోభ, యశ్వంత్‌లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలియడంతో అభిమానులు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

‘యశ్వంత్ నాకోసం సర్‌ప్రైజ్ ఇవ్వడానికి టీవీ షోకు వస్తాడని అసలు ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. షో వేదికపైనే మాకు ఎంగేజ్‌మెంట్ కూడా చేయించారు. యశ్వంత్‌ రింగ్ తీసుకొచ్చాడు, దండలు కూడా మార్చుకున్నాం. దాంతో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. నేను, యశ్వంత్ ఇద్దరం కలిసి ఒక టీవీ షోలో కనిపించడం ఇదే మొదటిసారి. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ హర్షం వ్యక్తం చేసింది శోభ. అదే సమయంలో ఎప్పుడూ టీవీ షోలకు రాని యశ్వంత్‌ను ఎందుకొచ్చావని ప్రశ్నవించింది. దీనికి యశ్వంత్‌ స్పందిస్తూ ‘ ఇలా ప్లాన్‌ చేస్తున్నామంటే వచ్చాను. కేవలం 10 నిమిషాలే మీరు సర్‌ ప్రైజ్‌ ఇస్తే బాగుంటుంది అన్నారు. నేను కూడా నీకు ఎప్పుడూ సర్‌ ప్రైజ్‌ ఇవ్వలేదు కదా.. అందుకే ఇలా ఫస్ట్ టైమ్ ట్రై చేద్దామని ఆలోచించాను. ఇదే ఫస్ట్. మళ్లీ ఎప్పుడూ ఇలా రాను’ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

శోభా శెట్టి ఎంగేజ్ మెంట్ వీడియో ఇదే..

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.