బిగ్‌బాస్ సీజన్ 7లో మొదటి రోజే క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది రతిక. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి కోసం సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో స్నేహం… కావాలని అతడిని ఎంకరేజ్ చేసి ప్రేమ పిచ్చోడిని చేసింది. ఇక ఆ తర్వాత నామినేషన్స్ లో వెన్నుపోటు పొడిచింది. దీంతో రతిక దెబ్బకు ప్రశాంత్ బిత్తరపోయాడు. ఇక నామినేషన్స్ తర్వాత నుంచి రతికకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక ఆ తర్వాత రెండో వారం ప్రిన్స్ యావర్ తో పులిహోర కలిపేసింది. ఐ లైక్ యూ అంటూ సినిమా స్టైల్లో పాటలు పాడుకున్నారు. దీంతో ‘బిగ్‌బాస్ బేబీ ‘ అంటూ మీమ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల విడుదలై బేబీ చిత్రాన్ని సరిగ్గా పోలుస్తున్న ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే అంతకు ముందు రతిక బ్రేకప్ గురించి మొదటి రోజే నాగార్జున అడగడం.. అందుకు మీరే కారణమని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ పిలవడం.. రతిక ఎమోషనల్ కావడంతో ఈ బ్యూటీ ప్రేమాయణం బయటకు వచ్చింది. రతిక ప్రేమించింది బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అనే విషయం నెట్టింట మారుమోగింది. అయితే వీళ్లిద్దరి బ్రేకప్ కు కారణం రాహుల్ పునర్నవితో క్లోజ్ గా ఉండడమే అనే వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే తన జీవితంలో జరిగిన బ్రేకప్ గురించి రతిక గతంలోనే చెప్పేసింది. ఇప్పుడు అదే వీడియో వైరలవుతుంది.
సినిమాల్లోకి రాకముందే తనకు లవ్ ఉండేదని.. అప్పటికే ఒక సినిమా కూడా కంప్లీట్ అయ్యిందని.. అదే లాస్ట్ మూవీ.. తర్వాత మ్యారేజ్ అనుకున్నారట. కానీ తర్వాత వాళ్లకు ఇంట్రెస్ట్ లేదని.. ఏదైనా జాబ్ చేస్తే ఓకే.. కానీ ఇండస్ట్రీలో ఉండొద్దని చెప్పారట. అప్పుడప్పుడే తనకు ఆఫర్స్ రావడం.. ఆలోపే 2,3 సినిమాలు చేసినట్లు తెలిపింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించానని.. పెళ్లి విషయంలో తనకు ఇంకా టైమ్ కావాలనిపించిందని.. అప్పుడే మ్యారేజ్ అనేది తనకు మంచి డెసిషన్ అనిపించలేదని చెప్పుకొచ్చింది రతిక. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. రతిక వదిలేసిన తర్వాతే రాహుల్ లైఫ్ బాగుందని.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.