బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరోవారంలో నయని పావని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టిన నయని కేవలం ఒక వారంలోనే బయటకు వచ్చేసింది. ఇది బిగ్ బాస్ ఆడియెన్స్‌ను షాక్ కు గురిచేసింది. ఎందుకంటే హౌజ్‌లోని ఇతర కంటెస్టెంట్స్ కంటే నయని చాలా మేలు. తన క్యూట్ లుక్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. వారంలోనే తనపై పాజిటివ్ ఫీల్ వచ్చేలా హౌజ్‌లో నడుచుకుంది. అయితే గేమ్స్, టాస్క్‌లో తనను తాను ప్రూవ్ చేసుకునే టైమ్ ఇవ్వలేకపోయాడు బిగ్‌బాస్. వచ్చిన వారానికే నయనిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు. దీంతో చాలామంది బిగ్‌బాస్‌పై విరుచుకుపడ్డారు. నయని పావనిది ఫేక్ ఎలిమినేషన్ అంటూ హోరెత్తించాడు. ఆమెను హౌజ్ నుంచి పంపించడం చాలా అన్యాయమంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ప్రేక్షకులే కాదు యాంకర్లు, ఇతర సినీ సెలబ్రిటీలు కూడా నయని పావని ఎలిమినేషన్‌పై పెదవి విరిచారు. బిగ్‌బాస్ టీమ్‌పై మండిపడ్డారు. తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటుడు అర్జున కల్యాణ్ కూడా నయని ఎలిమినేషన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయంపై స్పందించిన అర్జున్ బిగ్ బాస్ టీమ్‌పై సంచలన కామెంట్లు చేశాడు. నయని పావని ఎలిమినేట్ చేయడం వల్ల బిగ్ బాస్ షో తన విలువను కోల్పోయిందంటూ ఈ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
‘నయని పావని ఎలిమినేషన్ ప్రక్రియలో చాలా లోపాలున్నాయి. ఆమె హౌజ్ నుంచి బయటకు రావడం తనను ఎంతో బాధించింది. ఎంతో యాక్టివ్‌గా ఉండే నయనికి ఇలా జరగడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. నయని పావని ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ రియాలిటీ షో క్రెడిబిలిటీ దెబ్బ తినే అవకాశముంది. దీని వల్ల షో నిర్వాహకులకు భారీ నష్టం కలగవచ్చు. ఆడియెన్స్ వేసే ఓటింగ్‌కు, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ విజయాన్ని ప్రేక్షకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ అన్నీ సీజన్లకు సంబంధించిన ఓటింగ్, ఎలిమినేషన్ వివరాలు ఇవ్వాలని ఎవరైనా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి’ అని ట్వీట్ చేశాడు అర్జున్ కల్యాణ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నయనికి, అర్జున్‌కు సపోర్టుగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనికిరాని పిటిషన్లు తీసోకోవడానికి కోర్టులు ఖాళీగా లేవులే బ్రో అంటూ అర్జున్‌కు కౌంటర్లు ఇస్తున్నారు.
Felt really bad for #NayaniPavani. She didn’t deserve it for sure. Huge loss for the show and their credibility. Hope ppl realize now that there is no link between voting and eliminations. Somebody should file a PIL to show the votings of all seasons and eliminations.…
— Arjun Kalyan (@ArjunKalyan) October 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..