Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: తండ్రి అయిన బిగ్‏బాస్ అర్జున్ అంబటి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.. పాప పేరేంటంటే..

బిగ్‏బాస్ హౌస్‏లోనే అర్జున్ భార్య సురేఖకు శ్రీమంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే రోజున అర్జున్ మాట్లాడుతూ.. తనకు పాప పుట్టినా, బాబు పుట్టిన ఆర్ఖా అనే పేరునే పెట్టుకుంటామని చెప్పాడు. తన పేరులో నుంచి అర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకుని అర్ఖా అని తన బిడ్డకు పెడుతున్నామని అన్నాడు. అయితే తనకు మాత్రం కూతురే పుట్టాలని ఉందని చెప్పాడు. ఇప్పుడు అర్జున్ కోరుకున్నట్లే అతడికి కూతురు పుట్టింది. తన పాపకు అర్ఖా అని పేరు పెడుతున్నట్లు చెప్పేశాడు. అ

Bigg Boss 7 Telugu: తండ్రి అయిన బిగ్‏బాస్ అర్జున్ అంబటి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సురేఖ.. పాప పేరేంటంటే..
Arjun Ambati, Surekha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2024 | 2:57 PM

బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. ఆయన భార్య సురేఖ జనవరి 9న (మంగళవారం) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. తన కూతురి పేరును రివీల్ చేశాడు. గతంలో బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై చెప్పినట్లుగానే తమ పాపకు ఆర్ఖా అని పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. బిగ్‏బాస్ హౌస్‏లోనే అర్జున్ భార్య సురేఖకు శ్రీమంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే రోజున అర్జున్ మాట్లాడుతూ.. తనకు పాప పుట్టినా, బాబు పుట్టిన ఆర్ఖా అనే పేరునే పెట్టుకుంటామని చెప్పాడు. తన పేరులో నుంచి అర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకుని అర్ఖా అని తన బిడ్డకు పెడుతున్నామని అన్నాడు. అయితే తనకు మాత్రం కూతురే పుట్టాలని ఉందని చెప్పాడు. ఇప్పుడు అర్జున్ కోరుకున్నట్లే అతడికి కూతురు పుట్టింది. తన పాపకు అర్ఖా అని పేరు పెడుతున్నట్లు చెప్పేశాడు. అర్జున్, సురేఖ దంపతులకు సోషల్ మీడియా వేదికగా బుల్లితెర సెలబ్రెటీలు, బిగ్‏బాస్ కంటెస్టెంట్స్, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బిగ్‏బాస్ సీజన్ 7లోకి ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన మొదటి రోజు నుంచే ఆట తీరు.. మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రతి టాస్కులో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే ఆడి గెలిచాడు. చివరకు ఫినాలే అస్త్ర గెలుచి మొదటి ఫైనలిస్ట్ గా గెలిచాడు. ఫినాలే రోజున ఆరవ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు అర్జున్. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోస్, సీరియల్స్ చేస్తున్నాడు. అలాగే హౌస్ లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేశాడు అర్జున్. డైరెక్టర్ బుచ్చిబాబు సన, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో అర్జున్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‏బాస్ స్టేజ్ పై స్వయంగా చెప్పేసిన సంగతి తెలిసిందే.

Arjun Ambati

Arjun Ambati

అగ్నిసాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అర్జున్. స్టార్ మాలో ప్రసారమైన ఈ సీరియల్ టాప్ 5లో దూసుకుపోయింది. ఆ తర్వాత దేవత సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సీరియల్ కంప్లీట్ కాగానే బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో మెప్పించాడు. ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి చివరి వరకు నిలిచాడు అర్జున్. గర్భంతో ఉన్న తన భార్యను వదిలి బిగ్‏బాస్ షోకు రావడం తనకు ఇష్టం లేదని.. తన భార్య గురించి ఆలోచిస్తూ బాధపడిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లే తనకు కూతురు పుట్టడంతో సంతోషంలో మునిగిపోయాడు అర్జున్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.