- Telugu News Photo Gallery Cinema photos Actress Anasuya Bharadwaj Strong Answer To Trollers Goes Viral Telugu Actress Photos
Anasuya Bharadwaj: వారిని వింత జంతువులతో పోల్చిన అనసూయ.!
ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప సీక్వెల్‌లో పుష్పరాజ్ కోసం ఎంత ఇష్టంగా ఎదురుచూస్తున్నారో, దాక్షాయిని కేరక్టర్ కోసం కూడా అంతే క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు. అనసూయ కెరీర్లో చేసిన కేరక్టర్లలో దాక్షాయణికి అంత పేరు వచ్చింది మరి. 2023లో నెంబరాఫ్ మూవీస్‌తో జనాలను పలకరించిన అనసూయ ఈ ఏడాది ఏం చేయబోతున్నారు? సిల్వర్ స్క్రీన్ రంగమ్మత్త అనసూయ ఏం చేసినా సంచలనమే.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 09, 2024 | 4:24 PM

ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప సీక్వెల్‌లో పుష్పరాజ్ కోసం ఎంత ఇష్టంగా ఎదురుచూస్తున్నారో, దాక్షాయిని కేరక్టర్ కోసం కూడా అంతే క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నారు జనాలు. అనసూయ కెరీర్లో చేసిన కేరక్టర్లలో దాక్షాయణికి అంత పేరు వచ్చింది మరి.

2023లో నెంబరాఫ్ మూవీస్‌తో జనాలను పలకరించిన అనసూయ ఈ ఏడాది ఏం చేయబోతున్నారు? సిల్వర్ స్క్రీన్ రంగమ్మత్త అనసూయ ఏం చేసినా సంచలనమే.

ఆమె సినిమా యాక్సెప్ట్ చేశారంటే, ఆ కేరక్టర్‌లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి తీరుతుందనే నమ్మకం ఆడియన్స్ ది. స్క్రిప్ట్ సెలక్షన్ టైమ్‌లో ఈ విషయాన్ని గట్టిగానే గుర్తుపెట్టుకుంటున్నారు మేడమ్ అనసూయ.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ రీసెంట్‌గా తన ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియా ట్రోలర్స్ ని పట్టించుకుని, టైమ్ వేస్టు చేసుకోదలచుకోవట్లేదని డిక్లేర్ చేశారు అనసూయ. అలాంటి వాళ్లని వింత జంతువులతో పోల్చారు.

అలాంటి విషయాలు మాట్లాడటం కన్నా కెరీర్ మీద ఫోకస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నది మేడమ్ ఒపీనియన్. తన కెరీర్ స్టార్టింగ్‌లో టెలివిజన్ ఎంతగానో ఉపయోగపడిందని గుర్తుచేసుకున్నారు అనసూయ. ప్రస్తుతం ఫోకస్ మంచి ప్రాజెక్టుల మీద ఉందని అన్నారు.

అంతే కాదు, ఇంట్లో ఎప్పుడూ ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం వల్ల, బయట కూడా అదే వచ్చేస్తుందని, తన చదువు కూడా ఇంగ్లిష్ మీడియంలోనే సాగిందని అంటున్నారు ఈ బ్యూటీ.

ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప సీక్వెల్ కోసం అల్లు ఆర్మీ వెయిట్ చేస్తోంది. ఈ సినిమాలో దాక్షాయిణిగా మంచి రోల్ చేశారు అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్త కేరక్టర్ని కూడా గుర్తుచేసుకుంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.





























