Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్‏లోకి మరికొంత మంది కంటెస్టెంట్స్.. జంటలుగా వెళ్లనున్నది ఎవరంటే..

|

Sep 09, 2023 | 11:37 AM

పవర్ అస్త్రం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లే కన్ఫార్మ్ అవుతారని చెప్పేశారు. ఇక ఈసారి రెండవ రోజు నుంచి ఇంట్లో సభ్యులకు టాస్కులు ఇచ్చి ఇమ్యూనిటీ కోసం పోటీ పడమన్నారు. ఇక ఫస్ట్ నామినేషన్స్ లోనే గేమ్ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. మరోవైపు ఇప్పుడే హౌస్ లో లవ్

Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్‏లోకి మరికొంత మంది కంటెస్టెంట్స్.. జంటలుగా వెళ్లనున్నది ఎవరంటే..
Bigg Boss 7 Telugu
Follow us on

తెలుగులో బిగ్‏బాస్ రియాల్టీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. గత సీజన్స్ మాదిరిగా కాకుండా ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ ముందే చెప్పేసిన నాగ్.. ఈసారి హౌస్మెట్స్ విషయంలో సరికొత్త దారిని ఎంచుకున్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి అడుగుపెట్టారు. కానీ వారంత ఇంకా కన్ఫార్మ్ కాదని కంటెస్టెంట్స్ మాత్రమే అంటూ గుర్తు చేస్తున్నారు. పవర్ అస్త్రం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లే కన్ఫార్మ్ అవుతారని చెప్పేశారు. ఇక ఈసారి రెండవ రోజు నుంచి ఇంట్లో సభ్యులకు టాస్కులు ఇచ్చి ఇమ్యూనిటీ కోసం పోటీ పడమన్నారు. ఇక ఫస్ట్ నామినేషన్స్ లోనే గేమ్ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు హౌస్ నుంచి బయటకు వచ్చేందుకు మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. మరోవైపు ఇప్పుడే హౌస్ లో లవ్ ట్రాక్స్, గాసిప్స్ తారాస్తాయికి చేరాయి. ఇక ఇప్పుడిప్పుడే గ్రూప్స్ రెడీ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈసారి వీకెండ్ లో ఇంట్లోకి మరికొంత మంది కంటెస్టెంట్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫేమస్ సెలబ్రెటీలతోపాటు ఓ స్టార్ హీరోయిన్ కూడా ఇంట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈసారి వీకెండ్ లో హౌస్ లోకి హీరోయిన్ కౌషా, సీనియర్ హీరోయిన్ లైలా వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే దేవత సీరియల్ ఫేమ్ అర్జున్ అంబటి, యాంకర్ వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, యాక్టర్ క్రాంతి, నిఖిల్ విజయేంద్ర, పూజా మూర్తి, ఐశ్వర్య ఇంట్లోకి అడుగుపెట్టనున్నారట.

ఇవి కూడా చదవండి

అలాగే భోలే షావాలి, సీనియర్ హీరోయిన్ ఫర్జానా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వీరంత జంటలు జంటలుగా ఇంట్లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇంట్లో ఉన్నవారి కంటే ఆలస్యంగా హౌస్ లోకి అడుగుపెడుతున్నవారు కూడా పవర్ అస్త్రం కోసం పోటీ పడొచ్చు. మొత్తానికి ఈ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అనేట్టుగానే డిజైన్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.