Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన షకీలా.. రెండు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?

|

Sep 18, 2023 | 5:00 PM

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ కాగా, ఈ వారం సీనియర్‌ నటి షకీలా బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేషన్‌కు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా వయసు రీత్యా షకీలా బిగ్‌బాస్‌ హౌజ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండలేకపోయంది. అలాగే గేమ్స్‌, టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోయింది. హౌజ్‌ కంటే స్మోకింగ్ రూంలోనే ఎక్కువగా కనిపించింది.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన షకీలా.. రెండు వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా?
Actress Shakeela
Follow us on

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ కాగా, ఈ వారం సీనియర్‌ నటి షకీలా బయటకు వచ్చింది. ఆమె ఎలిమినేషన్‌కు చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా వయసు రీత్యా షకీలా బిగ్‌బాస్‌ హౌజ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండలేకపోయంది. అలాగే గేమ్స్‌, టాస్కుల్లోనూ చురుగ్గా పాల్గొనలేకపోయింది. హౌజ్‌ కంటే స్మోకింగ్ రూంలోనే ఎక్కువగా కనిపించింది. అయితే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లందరితోనూ ఎంతో కలుపుగోలుగా వ్యవహరించిందామె. ఎంతో హుందాగా వ్యవహరించింది. దీంతో అందరూ ఆమెను షకీలా అమ్మగా పిలిచారు. అయితే నామినేషన్స్‌ అంటే మాత్రం తెగ భయపడిపోయేది షకీలా. తన హుందాతనంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌కు బాగా చేరువైన ఆమె ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఓటింగ్‌లో బాగా వెనకబడిపోయింది. చివరకు రెండో వారం నామినేషన్స్‌లో ఉన్న షకీలా బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. కాగా ఇప్పటివరకు శృంగారతారగా షకీలాపై చాలామందికి చెడు అభిప్రాయాలు ఉండేవి. అయితే బిగ్‌బాస్‌ పుణ్యమా అని వారందరూ తమ అభిప్రాయాలను కచ్చితంగా మార్చుకుంటారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో అంత సింప్లిసీటీగా ఉన్నారామె. అందుకే హౌజ్‌ నుంచి షకీలా బయటకు వెళ్లిపోతుంటే అమర్ దీప్ ఏడ్చేశాడు. టేస్టీ తేజ కూడా ఎమోషనల్‌ అయ్యాడు. ఇక మరో హౌజ్‌మేట్‌ దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ అంటూ పాట ఆలపిస్తూ కన్నీటి పర్యంతమైంది. దీన్ని బట్టే చెప్పవచ్చు బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్‌తో షకీలా ఎలా ఉన్నారో?

 

ఇవి కూడా చదవండి

కాగా రెండు వారాలకే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చినా రెమ్యునరేషన్‌ గట్టిగానే అందుకుందట షకీలా. సాధారణంగా పాపులారిటీ, క్రేజ్‌ను బట్టి కంటెస్టెంట్స్‌కు పారితోషకం ఫిక్స్‌ చేస్తారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అలా షకీలాకు వారానికి రూ.3. 5 లక్షలు ఫిక్స్‌ చేశారట. రెండో వారంలో హౌజ్‌ నుంచి బయటకు రావడంతో షకీలా కు సుమారు రూ. 7 నుంచి రూ. 8 లక్షల రెమ్యునరేషన్‌ అందించారని టాక్‌ వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌజ్ లో షకీలా..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో చూశారా?

బిగ్ బాస్ నామినేషన్ష్ షురూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..