Bigg Boss 7 Telugu: ‘ఏహే.. నేనే పోతా.. ఉండలేను..’ అలిగిన అమర్ దీప్.. ముఖానికి రంగు పూసుకొని..

|

Oct 07, 2023 | 8:03 AM

ఎవరి టీషర్ట్ పై తక్కువ రంగు ఉంటుందో వారే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్‏బాస్ చెప్పారు. ఇందులో ప్రశాంత్ తప్ప మిగిలిన ముగ్గురు బలంగా ఉన్నవాళ్లే. కానీ గెలవాలన్న కసితో ఆడిన ప్రశాంత్.. ఒక్కొక్కరిని అల్లాడించేశాడు. అతడిని ఎలాగైనా గెలవకుండా మిగతా ఇంటిసభ్యులు ఎంత ట్రై చేసినా చివరకు సాధించి ఓడించాడు. మొత్తానికి మొదటి కెప్టెన్ గా నిలిచాడు ప్రశాంత్. అయితే ఈ టాస్కులో సందీప్ వర్సెస్ ప్రశాంత్ అన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ప్రశాంత్ కొట్టాడు.. తోశాడంటూ నానా రద్ధాంతం చేశాడు

Bigg Boss 7 Telugu: ఏహే.. నేనే పోతా.. ఉండలేను.. అలిగిన అమర్ దీప్.. ముఖానికి రంగు పూసుకొని..
Amardeep
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 మొదటి వారం కెప్టెన్‏గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇందుకోసం జరిగిన రంగుపడుద్ది టాస్కులో విరుచుకుపడ్డాడు. టేస్టీ తేజ, సందీప్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. ఎవరి టీషర్ట్ పై తక్కువ రంగు ఉంటుందో వారే కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్‏బాస్ చెప్పారు. ఇందులో ప్రశాంత్ తప్ప మిగిలిన ముగ్గురు బలంగా ఉన్నవాళ్లే. కానీ గెలవాలన్న కసితో ఆడిన ప్రశాంత్.. ఒక్కొక్కరిని అల్లాడించేశాడు. అతడిని ఎలాగైనా గెలవకుండా మిగతా ఇంటిసభ్యులు ఎంత ట్రై చేసినా చివరకు సాధించి ఓడించాడు. మొత్తానికి మొదటి కెప్టెన్ గా నిలిచాడు ప్రశాంత్. అయితే ఈ టాస్కులో సందీప్ వర్సెస్ ప్రశాంత్ అన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ప్రశాంత్ కొట్టాడు.. తోశాడంటూ నానా రద్ధాంతం చేశాడు సందీప్. ఇక ఆ తర్వాత శివాజీ వర్సెస్ అమర్ దీప్. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అసలు కెప్టెన్సీ టాస్క్ తో సంబంధం లేని అమర్.. అనవసర విషయాలను తీసుకువస్తూ శివాజీతో గొడవపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‏లో అమర్ బిహేవియర్ ప్రేక్షకులకు కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించింది.

రంగుపడుద్ది రాజా టాస్కు నడుస్తుండగా.. టేస్టీ తేజ ఔట్ అని ప్రియాంక అనౌన్స్ చేసింది. దీంతో శివాజీ ప్రియాంకతో మాట్లాడేందుకు ట్రై చేయగా.. ప్రశాంత్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నావని వాదించాడు అమర్. ప్రశాంత్ గెలుస్తాడన్నా.. నువ్వు కంగారు పడకు అంటూ సెటైర్ వేశాడు అమర్ దీప్. దీంతో చెప్పేది వినకుండా ఏదేదో వాగుతుండడంతో విసుగొచ్చిన శివాజీ ఊరికే కంటెంట్ కోసం మాట్లాడతావ్.. నేను ప్రశాంత్ గురించి మాట్లాడతానని నీకు చెప్పానా అంటూ సీరియస్ అయ్యాడు. చెప్పక్కర్లేదు నాకు తెలుసు.. వాడిని తప్ప మిగిలిన వాళ్లను నువ్వు ఎప్పుడు ఎంకరేజ్ చేశావని అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు అమర్. దీంతో చిరాకొచ్చిన శివాజీ .. అది నీ కర్మ.. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను అంటూ వెళ్లిపోయాడు. వంకరగా పుట్టాను కదా.. నాకు ఏం అర్థం కాదు.. నేను వెళ్లిపోతా.. ఇంత దరిద్రమైన ఆలోచనతో ఉన్న ఇక్కడ బతకలేను. నేనే వెళ్లిపోతా అంటూ అరుస్తూ తిరిగేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక చివరకు ప్రశాంత్ గెలిచి కెప్టెన్ అంటూ బిగ్‏బాస్ అనౌన్స్ చేసిన తర్వాత అమర్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. ముఖానికి రంగు పూసేసుకొని ఓ మూల కూర్చున్నాడు. ప్రియాంక్ లేదు ఎవ్వరూ లేరు.. అందరు ఏకమైపోయారు. నాకు ఎవ్వరూ లేరు నేనే ప్రాబ్లమ్ ఇక్కడ అందరికీ…వాడేమో లెటర్ దానం చేసి (యావర్) అమ్మాయికి (శుభ శ్రీ) మసాజ్ చేస్తూ కూర్చున్నాడు. నేను వేస్ట్ అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో ప్రియాంక వచ్చే ఏమైందని అడగ్గా.. నేను వేస్ట్ పీస్.. బీ ఇన్ యూ ఆర్ లిమిట్స్ అంటూ చీదరించుకున్నప్పుడు నాకు కోపం వస్తుంది. వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడలేను అంటూ రగిలిపోయాడు అమర్ . మొత్తానికి టాస్క్ ఓడిపోయామని బాధో లేక ప్రశాంత్ గెలిచాడనే కోపంతో రగిలిపోయాడు అమర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.