Bigg Boss 7 Telugu: సందీప్, శివాజీలను కడిగిపారేసిన నాగ్.. తేజ క్రూరత్వానికి వీడియో నిదర్శనం..

|

Sep 30, 2023 | 5:04 PM

ఎప్పటిలాగే అమర్ దీప్, యావర్, గౌతమ్, సందీప్ మధ్య చిన్నపాటి గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. చివరగా నాలుగో వారం పవరాస్త్ర గెలుచుకుని నాలుగో ఇంటి సభ్యుడు అయ్యాడు ప్రశాంత్. ఇక వీకెండ్ వచ్చేసింది. ఈ వారం రోజులుగా బిగ్‏బాస్ హౌస్ లో జరిగిన టాస్కులు, కంటెస్టెంట్స్ ప్రవర్తనపై క్లాస్ తీసుకునేందుకు రెడీ అయ్యార్ హోస్ట్ నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో చేతిలో బెల్డ్ పట్టుకుని చాలా సీరియస్ గా వచ్చేశారు నాగ్. రావడంతోనే శివాజీ, సందీప్ లను కడిగిపారేశారు.

Bigg Boss 7 Telugu: సందీప్, శివాజీలను కడిగిపారేసిన నాగ్.. తేజ క్రూరత్వానికి వీడియో నిదర్శనం..
Bigg Boss 7 Telugu Promo
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో మొన్నటి వరకు కండల వీరులు కొట్టుకునేవరకు వెళ్లారు. నువ్వా నేనా అన్న రేంజ్‏లో మీద మీదకు అరుస్తూ వెళ్లగా మిగతా ఇంటి సభ్యులు ఆపారు. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే అమర్ దీప్, యావర్, గౌతమ్, సందీప్ మధ్య చిన్నపాటి గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. చివరగా నాలుగో వారం పవరాస్త్ర గెలుచుకుని నాలుగో ఇంటి సభ్యుడు అయ్యాడు ప్రశాంత్. ఇక వీకెండ్ వచ్చేసింది. ఈ వారం రోజులుగా బిగ్‏బాస్ హౌస్ లో జరిగిన టాస్కులు, కంటెస్టెంట్స్ ప్రవర్తనపై క్లాస్ తీసుకునేందుకు రెడీ అయ్యార్ హోస్ట్ నాగ్. గతవారమే కంప్లీట్ గా హోస్టింగ్ స్టైల్ మార్చారు నాగ్. ఇక ఈవారం హోస్టింగ్ తో మరింత అదరగొట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోలో చేతిలో బెల్డ్ పట్టుకుని ఒక్కొక్కరి ఆట కట్టించేందుకు రెడీ అయ్యారు నాగ్. ఇక స్టేజ్ పైకి రావడంతోనే శివాజీ, తుప్పాస్ సంచాలక్ సందీప్ లను కడిగిపారేశారు.

నాగార్జున సీరియస్‏గా రావడం చూసి కంటెస్టెంట్స్ ముఖాలు మాడిపోయాయి. ఇక ఎప్పటిలాగే తుప్పాస్ సంచాలక్‏గా చేసిన సందీప్ ను కడిగిపారేశారు. ముందుగా సంచాలక్ సందీప్ నువ్వు గుడ్డివాడివా.. కెమెరాలో ఏం జరుగుతుందో నీకు కనిపించలేదా అని శివాజీని అడగ్గా.. అరిచానని శివాజీ చెప్పుకొచ్చాడు. గౌతమ్ తేజకు బెల్డ్ వేసి లాగినప్పుడు మాత్రమే చెప్పావని.. తేజ గౌతమ్ మెడకు వేసి లాగుతునప్పుడు చెప్పలేదని.. ఆ టైంలో నీ గొంతు ఏమైందంటూ ఫైర్ అయ్యారు. తేజా రాక్షసంగా గౌతమ్ మెడకు వేసి లాగే వీడియోను చూపించి ఇక్కడ నీ గొంతు ఏమైంది అని అడగ్గా.. నేను కావాలని చేయలేదండి.. అని శివాజీ అనేసరికి.. నువ్వు కావాలని చూశావో.. లేదా నేను చెప్తాను అని అన్నాడు నాగ్.

సంచాలక్ గా సందీప్ మొత్తం ఫెయిల్యూర్ అంటూ క్లాస్ తీసుకున్నాడు. దీంతో గతవారంలాగే సారీ అంటూ సింపుల్ గా చెప్పేశాడు సందీప్. ఇక తర్వాత అమ్మాయిలు అరుస్తున్న పట్టించుకోలేదని తేజను నిలదీయగా.. ఎంకరేజ్ అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు తేజ. అరుస్తుంటే ఎంకరేజ్ ఎలా అనుకుంటావ్ అని నాగ్ అడగ్గా.. మేము తర్వాత చెప్పాం కొట్టకూడదు అంటూ క్లారిటీ ఇచ్చింది శోభా శెట్టి. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేద్దామని అడ్డగా.. జైల్లో వేద్దామని శుభ శ్రీ చెప్పింది.. నేరుగా ఇంటికి పంపించడమే బెటర్ అంటూ సందీప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈవారం సంచాలక్ సందీప్ తోపాటు.. టేస్టీ తేజకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.