Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్ సెల్ఫ్ నామినేటెడ్.. ఇంట్లో ఉండడం ఇష్టంలేకే అలా చేసిందా ?.. ఈ వారం నామినేట్స్ వీరే..

యావర్ ఫౌల్ గేమ్ ఆడడాడని కొందరు నామినేట్ చేయగా.. అమర్ దీప్ ఏడుస్తున్నా మరీ అంతగా టార్గెట్ చేయడం నచ్చలేదంటూ ప్రతి ఒక్కరూ ఒక్కొ రీజన్ చెప్పేశారు. మాటల యుద్ధాలు.. పంచులు, కౌంటర్లతో ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్‏లో జరిగింది. ప్రశాంత్, గౌతమ్ మధ్య అనవసరపు పంచె పంచాయతీ మొదలై డాక్టర్స్ వర్సెస్ రైతులు అనేదాక వెళ్లింది ముచ్చట. ప్రశాంత్ అనని మాటను అన్నాడంటూ రెచ్చిపోయాడు గౌతమ్.

Bigg Boss 7 Telugu: ఆ కంటెస్టెంట్ సెల్ఫ్ నామినేటెడ్.. ఇంట్లో ఉండడం ఇష్టంలేకే అలా చేసిందా ?.. ఈ వారం నామినేట్స్ వీరే..
Bigg Boss 7
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 21, 2023 | 9:12 AM

బిగ్‌బాస్ 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ బట్టి మరుసటి రోజు నామినేషన్స్ జరుగుతుంటాయి. శనివారం నాగార్జున ఎవరినైతే తప్పుపడతారో ఎక్కువగా వారికే హౌస్మేట్స్ నామినేట్ చేస్తుంటారు. ఇక 12వ వారం ఎక్కువగా యావర్, గౌతమ్‏కు నామినేషన్స్ పడ్డాయి. యావర్ ఫౌల్ గేమ్ ఆడడాడని కొందరు నామినేట్ చేయగా.. అమర్ దీప్ ఏడుస్తున్నా మరీ అంతగా టార్గెట్ చేయడం నచ్చలేదంటూ ప్రతి ఒక్కరూ ఒక్కొ రీజన్ చెప్పేశారు. మాటల యుద్ధాలు.. పంచులు, కౌంటర్లతో ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రం ఓ రేంజ్‏లో జరిగింది. ప్రశాంత్, గౌతమ్ మధ్య అనవసరపు పంచె పంచాయతీ మొదలై డాక్టర్స్ వర్సెస్ రైతులు అనేదాక వెళ్లింది ముచ్చట. ప్రశాంత్ అనని మాటను అన్నాడంటూ రెచ్చిపోయాడు గౌతమ్. చివరకు వాదిస్తూనే దండం పెట్టేశాడు ప్రశాంత్. ముందుగా అమర్.. యావర్, రతికను నామినేట్ చేశాడు.

ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టి తప్పు చేశావ్ అంటూ అమర్ రీజన్ చెప్పగా.. కాలు కింద పెట్టలేదు.. అనుకోకుండా జరిగింది అని యావర్ అన్నాడు. ఆ సమయంలో చూడకుండా సంచాలక్ గా నువ్వు తప్పు చేశావ్ అని యావర్ చెప్పడంతో తప్పు ఒప్పుకున్నాడు అమర్. ఆ తర్వాత రతికను నామినేట్ చేశాడు. తర్వాత గౌతమ్ .. ప్రశాంత్, శివాజీలను నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రశాంత్ గౌతమ్, రతికను నామినేట్ చేశాడు. అయితే ఈ క్రమంలోనే ప్రశాంత్, గౌతమ్ మధ్య పంచె పంచాయతీ మొదలైంది.

ఆ తర్వాత రతిక అమర్ దీప్, ప్రశాంత్ నామినేట్ చేయగా.. అర్జున్.. యావర్, శివాజీని నామినేట్ చేశాడు. కానీ నామినేషన్లలో అసలు ట్విస్ట్ ఇచ్చింది అశ్విని. చిన్న చిన్న కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని.. ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పింది. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్‌బాస్ అన్నాడు. దీంతో సరేనని ఒప్పుకుంది. అయితే మొన్నటి వీకెండ్ ఎపిసోడ్‏ చూస్తే నామినేట్ చేయడానికి అశ్వినికి కారణాలు ఉన్నప్పటికీ ఆమె ఎవరినీ నామినేట్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. బహుశా ఆమెకు ఇక హౌస్ లో ఉండడం నచ్చకపోవ.. ఇక బయటకు వెళ్లాలని ఫిక్స్ అయ్యి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.