Bigg Boss 7 Telugu: ప్రశాంత్ వర్సెస్ గౌతమ్.. ‘పంచె’ గురించి పంచాయతీ.. దండం పెట్టేసిన రైతుబిడ్డ..

పాస్ కు సంబంధించిన ఓ గేమ్ లో శివాజీ, యావర్ లు ఫౌల్స్ చేసినా నువ్వు సంచాలక్ గా వాళ్లను తప్పించలేదు. అందుకే నామినేట్ చేస్తున్నానంటూ గౌతమ్ చెప్పాడు. నేను సంచాలక్ గా ఫెయిల్ అయి ఉంటే నాగార్జున సార్ ఎందుకు చెప్పలేదని అన్నాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ వాయిస్ రేజ్ చేసి ప్రతి వీక్ పాయింట్ చెప్పరు కదా నాగ్ సార్.. నువ్వు చూడాలని గౌతమ్ అనడంతో అసలు నీది పాయింటే కాదని అన్నాడు రైతు బిడ్డ. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే అర్థంలేని డైలాగ్స్ కొట్టాడు గౌతమ్.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ వర్సెస్ గౌతమ్.. 'పంచె' గురించి పంచాయతీ.. దండం పెట్టేసిన రైతుబిడ్డ..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 21, 2023 | 6:56 AM

బిగ్‌బాస్ 7 సీజన్ 12వ వారంలోకి అడుగుపెట్టేసింది. 11వారం నో ఎలిమినేషన్ కావడంతో అంతా సేవ్ అయ్యారు. ఇక సోమవారం మాత్రం నామినేషన్స్ రసవత్తరంగానే సాగాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్సెస్ గౌతమ్ మధ్య పంచె పంచాయతీ నడిచింది. సంచాలక్ నుంచి మొదలైన టాపిక చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు పంచె గురించి మొదలైన గొడవ..రైతులు, డాక్టర్లు అనే స్థాయికి వెళ్లింది. 11వ వారం వీకెండ్ లో కొత్త స్నేహితుడు అంటూ గౌతమ్.. ప్రశాంత్ కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ మరుసటి రోజే ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎవిక్షన్ పాస్ కు సంబంధించిన ఓ గేమ్ లో శివాజీ, యావర్ లు ఫౌల్స్ చేసినా నువ్వు సంచాలక్ గా వాళ్లను తప్పించలేదు. అందుకే నామినేట్ చేస్తున్నానంటూ గౌతమ్ చెప్పాడు. నేను సంచాలక్ గా ఫెయిల్ అయి ఉంటే నాగార్జున సార్ ఎందుకు చెప్పలేదని అన్నాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ వాయిస్ రేజ్ చేసి ప్రతి వీక్ పాయింట్ చెప్పరు కదా నాగ్ సార్.. నువ్వు చూడాలని గౌతమ్ అనడంతో అసలు నీది పాయింటే కాదని అన్నాడు రైతు బిడ్డ. ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే అర్థంలేని డైలాగ్స్ కొట్టాడు గౌతమ్. అశ్వద్థామ.. చావడు పో.. నేను పోతాను అనుకుంటున్నారు.. కానీ నేను పోను అంటూ అర్థంకానీ డైలాగ్స్ కొట్టాడు.

ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్ ను నామినేట్ చేస్తూ… నన్ను కెప్టెన్సీ రేసు నుంచి ఫస్టే ఎందుకు తీసేశావ్.. నేను కష్టపడ్డా కదా అన్నా అంటూ ప్రశాంత్ అడిగాడు. దీంతో ప్రియాంకను కెప్టెన్ చేద్దామని నేను అలా చేశా అని చెప్పాడు గౌతమ్. సంచాలక్ గా నేను తప్పు చేస్తే.. నాతోపాటు మరో సంచాలక్ ఉంది ఆమెను ఎందుకు చేయలేదు అని ప్రశాంత్ అడగ్గా.. బెస్ట్ ఆప్ 6 అంటూ లాజిక్స్ చెప్పుకున్నాడు. దీంతో సేఫ్ గేమ్ అని ప్రశాంత్ కౌంటరివ్వగా.. నా పంచె ఆనవాయితీ లెక్క నీకు కూడా రివెంజ్ ఆనవాయితీ అన్నాడు గౌతమ్. దీంతో ఆ పంచె ఊడిపోకుండా కాపాడుకో.. పంచెకి ఇజ్జత్ ఇయ్.. అంటూ కౌంటరిచ్చాడు ప్రశాంత్. దీంతో గౌతమ్ అరవడం స్టార్ట్ చేశాడు. పంచె ఆనవాయితీ.. పర్సనల్.. మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు ప్రశాంత్.. ఎక్కువ తక్కువ మాట్లాడినవ్ అనుకో వినడానికి ఎవరూ లేరిక్కడ.. మంచిగుండదు అంటూ సీరియస్ అయ్యాడు గౌతమ్. దీంతో రెండు గోళీలు వేసుకో తగ్గుతది అంటూ ప్రశాంత్ కౌంటరివ్వడంతో మరోసారి రెచ్చిపోయాడు గౌతమ్. ప్రొఫెషన్ గురించి మాట్లాడకు అంటూ సీరియస్ అయ్యాడు.

అయితే నామినేషన్స్ మొత్తంలోనూ గౌతమ్ అదే టాపిక్ పట్టుకుని అరుస్తూ ఉండిపోయాడు. గోళీలు వేసుకో అంట.. డాక్టర్ అంటే దేవుడు.. నా ప్రొఫెషన్ గురించి డ్రెస్సింగ్ గురించి అంటే బాగుండదు అంటూ అర్థంలేని టాపిక్ మాట్లాడాడు. నేను ఆ రెండింటి గురించి మాట్లాడలేదు కదా అన్నా అంటూ ప్రశాంత్ అనడంతో రైతులు, విత్తనాలు అంటూ అనవసరమైన టాపిక్ తీసుకొచ్చి రచ్చ చేశాడు గౌతమ్. నేను పంచె గురించి మాట్లాడలేదు.. దానిని ఊడిపోకుండా చూసుకో అన్నాను అంతే అంటూ దండం పెట్టేశాడు ప్రశాంత్.