Brahmamudi, November 21st episode: ‘అక్రమ సంబంధం’ అనగానే హడలిన స్వప్న.. చేయి కట్ చేసుకున్న అప్పూ!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాహుల్ చెప్పడంలో అరుణ్ స్వప్నకి ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ చేయడంతో.. ఆవేశంతో ఊగిపోతుంది స్వప్న. నీకు రాత్రే చెప్పాను కదా మళ్లీ రాత్రి నాతో ఫోన్ లో మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అని స్వప్న అంటే.. అక్రమ సంబంధం.. గురించి మన సంబంధం గురించి అప్పుడే మర్చిపోయావా అని అరుణ్ అనగానే షాక్ అవుతుంది స్వప్న. అసలు నీకు ఏం కావాలి రా.. ఎందుకిలా నన్ను టార్చర్ పెడుతున్నావ్ అని స్వప్న అంటే.. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడావ్.. అని అరుణ్ అంటాడు. మరి రాత్రి నన్ను ఎందుకు కలవడానికి వచ్చావ్ అని స్వప్న అడిగితే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాహుల్ చెప్పడంలో అరుణ్ స్వప్నకి ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ చేయడంతో.. ఆవేశంతో ఊగిపోతుంది స్వప్న. నీకు రాత్రే చెప్పాను కదా మళ్లీ రాత్రి నాతో ఫోన్ లో మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను అని స్వప్న అంటే.. అక్రమ సంబంధం.. గురించి మన సంబంధం గురించి అప్పుడే మర్చిపోయావా అని అరుణ్ అనగానే షాక్ అవుతుంది స్వప్న. అసలు నీకు ఏం కావాలి రా.. ఎందుకిలా నన్ను టార్చర్ పెడుతున్నావ్ అని స్వప్న అంటే.. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడావ్.. అని అరుణ్ అంటాడు. మరి రాత్రి నన్ను ఎందుకు కలవడానికి వచ్చావ్ అని స్వప్న అడిగితే.. నీకు భయాన్ని కలగ జేయడానికి అని అంటాడు అరుణ్. దానికి షాక్ అవుతుంది స్వప్న. నేను ఇంటికి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను. ఇప్పుడు నాకు కావాల్సింది అడుగుతాను. దానికి కాదూ కూడదూ అనకూడదని అంటాడు అరుణ్. ఏం కావాలి రా అని స్వప్న అడిగితే.. ఏం లేదు ఓ పది లక్షలు కావాలి అని అరుణ్ అడగ్గానే.. స్వప్న షాక్ అవుతుంది.
రాహుల్, రుద్రాణిల ఉచ్చులో మరోసారి ఇరుక్కున్న స్వప్న:
అసలు అంత డబ్బు నేను నీకు ఎందుకు ఇవ్వాలి. ఇంటికి వస్తే రా.. నాకేం భయం లేదని స్వప్న అంటే.. అయ్యో నేనెందుకు వస్తాను స్వప్న. నువ్వు నాతో కలిసి తిరిగినట్టే.. మనం రూమ్ లో గడిపినట్టు ఫొటోలు గ్రాఫిక్స్ చేసి ఇంటికి కొరియర్ పంపిస్తాను. అసలే నీకు అత్తింట్లో నీ మీద నమ్మకం లేదు. పుట్టింట్లో పరువు లేదు. ఇప్పుడు నాతో సంబంధం పెట్టుకున్నావ్ అని తెలిస్తే రోడ్డు పాలు అవుతావ్. అదే నేను ఇప్పుడు అడిగినంత మనీ ఇచ్చేస్తే వదిలేస్తాను. నీ జోలికి అస్సలు రాను అని అరుణ్ అంటే.. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకు రావాలని స్వప్న అడుగుతంది. అది నాకు అనవసరం. జాగ్రత్త అని అంటాడు అరుణ్. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకు రావాలి అని స్వప్న కంగారు పడుతుంది. ఈ లోపు రాహుల్, రుద్రాణిలు ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. తాతయ్య ఇచ్చిన నగలు.. అని ఆలోచిస్తూ లేదు ఇప్పుడు అవి తాకట్టు పెట్టేస్తే.. ఇంట్లో అందరికీ సమాధానం చెప్పలేను. ఎలా అని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది.
బాధలో అప్పూ.. అప్పూ కోసం కంగారులో కనకం:
మరో వైపు అప్పూ ఆలోచిస్తూ కూర్చుంటుంది. వీధిలో అందరూ పరిగెడుతూ ఉంటారు. ఈలోపు కనకం వెళ్లి సీతా ఏమైంది అని అడుగుతుంది. మన కాత్యాయిని కూతురు సిరి ఉంది కదా.. ఆ అమ్మయి ఆత్మహత్య చేసుకుందంట. అయ్యే ఏమైందని కనకంగా కంగారుగా అడుగుతుంది. ఈ కాలం పిల్లల గురించి తెలిసిందే కదా.. ఇప్పుడు వాడు వేరే పిల్లని పెళ్లి చేసుకుందని తట్టుకోలేక ఇలా చేసింది అని అంటారు. దీంతో కనకం.. అప్పూ వైపు చూస్తుంది. దీంతో అప్పూను జాగ్రత్తగా చూసుకోవాలి అని అప్పూ దగ్గరకు వెళ్తుంది. ఇక్కడ ఒక్కదానివే కూర్చున్నావ్ ఎందుకు? పనులు ఎక్కువగా ఉన్నాయి.. నువ్వు వచ్చి నాకు సహాయం చేయవచ్చు కదా.. ఏ అమ్మ కోసం ఆ మాత్రం కూడా చేయలేవా.. అని కనకం అంటుంది. దీంతో అప్పూ సరే పదా చేస్తాను అని కోపంగా వెళ్తుంది.
స్వప్న, అరుణ్ లు ఫ్రెండ్స్ అని చెప్పిన పోలీస్:
మరోవైపు పోలీస్ సుమన్.. రాజ్ కి ఫోన్ చేస్తాడు. ఆ అరుణ్ అనే అతను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ లో ఉన్నాడు. అంతకుమించి అనుమానంగా ఏమీ అనిపించలేదు. అలాగే అతని కాలేజీ లైఫ్ గురించి కూడా ఎంక్వైరీ చేశాం. అతను చదివిన కాలేజీలోనే మీ ఇంటికి వచ్చిన స్వప్న గారు కూడా చదువుకున్నారు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని పోలీస్ సుమన్ చెప్తాడు. ఈలోపే కావ్య గదిలోకి వచ్చి.. మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంది. ఒక మనిషి ఇంట్లోకి వచ్చిన విషయం కూడా తెలీడం లేదంటే.. నీకు ఎంత రెస్పాన్స్ బులిటీ ఉందో అర్థం అవుతుందని రాజ్ అంటే.. ఆఫీస్ నుంచి వస్తూనే నా తో ఎలా గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారా అని కావ్య అంటుంది. నువ్వో పెద్ద లీడర్ మరి.. ప్లాన్ చేసి మరీ గొడవ పడటానికి.. అరే మొగుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. నీళ్లు కానీ కాఫీ ఇద్దామని తెలీదని వెటకారం చేస్తాడు రాజ్. అన్నమే తినలేదు ఇక కాఫీ తాగుతారని నేను ఎలా అనుకుంటానని కావ్య అంటే.. నేను వద్దూ అనే అంటాను అది నా పొగరు. కానీ భార్యగా నువ్వు తీసుకు రావాలని రాజ్ అంటాడు. మొన్న నటించాలి అని అన్నారు కదా అని కావ్య అంటే.. ఇప్పుడు కూడా భార్యగా నటిస్తూ కాఫీ తీసుకు రమ్మని అంటాడు రాజ్.
అప్పూకి ఏదో ఒక పని చెబుతూ జాగ్రత్తగా చూసుకుంటుంది కనకం:
ఇక దిగాలుగా కూర్చుంటుంది అప్పూ. దీంతో అప్పూకి ఒక్కో పని చెప్పి చేయిస్తుంది. దీని మనసు ఎలా అయినా మార్చాలని మనసులో అనుకుంటుంది కనకం. నెక్ట్స్ కూరగాయలు కట్ చేసి.. అప్పూ వెళ్లి పోతుంది. ఇది గమనించిన కనకం వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటే.. కూరగాయలు కట్ చేశాను అని అప్పూ చెప్తే.. అంతేలే నీకు ఈ అమ్మ అంటే అస్సలు ప్రేమ లేదు. అదే కావ్య అయితే నాతో ఒక్క పని కూడా చేయించేది కాదని కనకం కావాలనే చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా.. అని అప్పూ అడుగుతుంది. బట్టలు ఉతకమని అప్పూకి చెప్తుంది. సరే అని వెళ్తుంది అప్పూ. కనకం ఏమైందే.. ఎప్పుడూ పని చేప్నని నువ్వు పని చెప్తున్నావ్ అని అంటే ఏమీలేదని అంటుంది కనకం. ఆ పక్కింటి సిరిలాగా ఆత్మహత్య చేసుకుంటుందనా అని కనకం అక్క అడుగుతుంది. మరి ఏం చేయ మంటావ్ అక్కా.. దాని బాధ తీర్చలేను.. చూస్తూ ఊరుకోలేను అని చెప్తుంది కనకం.
ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని స్వప్నని అడిగిన రాహుల్:
అరుణ్ ని తిట్టని తిట్టు తిడుతుంది స్వప్న. అప్పుడే వచ్చిన రాహుల్ ఏమీ తెలీనట్టు ఏమైందని అడుగుతాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు రాహుల్. ఇలాంటివన్నీ బాగా కనిపెడతాడు. భార్యని సంతోష పెట్టడం తెలీదని మనసులో స్వప్న అనుకుటుంది. అంటే తాతయ్యకి ఒంట్లో బాగోలేదని.. మామ్ నీతో గొడవలు పడొద్దని చెప్పిందని అంటాడు రాహుల్. ఇక మరోవైపు స్వప్న ఆలోచనలో పడి.. నిజంగానే రాహుల్ అంత డబ్బు ఇస్తాడా.. సహాయం చేస్తాడా అని స్వప్న మనసులో ఆలోచిస్తుంది.
కావ్య, రాజ్ ల గిల్లికజ్జాలు.. చేయి కట్ చేసుకున్న అప్పు:
మరోవైపు రాజ్ తలుపుకి లాక్ పడక కుస్తీలు పడుతూ ఉంటాడు. అప్పుడే వచ్చి కావ్య ఏమైందని అడిగితే.. రాజ్ తిక్క సమాధానం ఇస్తాడు. దీంతో మరోసారి రాజ్, కావ్యలు గిల్లికజ్జాలు ఆడుతూ ఉంటుంది. దీంతో తలుపు గట్టిగా వేస్తాడు రాజ్. మళ్లీ ఆ డోర్ వచ్చి రాజ్ కి తగులుతుంది. దీంతో సైలెంట్ గా వెళ్లి పడుకుంటాడు. ఇక కావ్య పకపకమని నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పూ పాలు తీసుకు రాలేదని అప్పూ గదిలోకి వెళ్లి చూస్తుంది కనకం. అప్పూ చేతికి కట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. దీంతో కనకం షాక్ అవుతుంది.