బిగ్బాస్ నాలుగో వారం ఎలిమినేషన్ కంప్లీట్ అయ్యింది. అంతా ఊహించినట్లుగానే రతిక రోజ్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పటివరకు నలుగురు మహిళలు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక.. ఇలా వరుసగా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ కావడం బిగ్బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే..ఇప్పుడు ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే శివాజీ వర్సెస్ కంటెస్టెంట్స్ అన్నట్లుగా నామినేషన్ జరిగింది. తాజాగా ప్రోమోలో.. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని సరైన కారణాలతో నామినేట్ చేయాలని… వారు నామినేట్ చేస్తున్న వాళ్ల మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడవాల్సి ఉంటుంది ఆదేశించాడు బిగ్బాస్.
ఇక హోస్ట్ నాగార్జుననే సూటిగా ప్రశ్నించి ఒక్కొక్కరి తప్పులు బయటపెట్టిన శివాజీ.. ఇప్పుడు నామినేషన్స్ లోనూ అదే రీజన్స్ చెప్పాడు. ముందుగా వచ్చిన శివాజీ.. అమర్ దీప్ ను నామినేట్ చేస్తూ.. ‘అన్నా నువ్వు వారివైపే ఉంటున్నావ్ అంటున్నాడు అని’ అనగా..నీకు వాళ్లే ఇష్టమని అన్నాడు అమర్ దీప్.
ఇక గౌతమ్.. శివాజీని నామినేట్ చేస్తూ.. తేజ చాలాసార్లు మెడకు బెల్ట్ వేసినా మీరు ఆపలేదు.. సందీప్ నామినేషన్లో ఉంటే అతడిని నామినేట్ చేస్తానని అనగా.. మరీ నిన్న సందీప్ కు చెయ్యి ఎత్తాలి కదా.. నాకెందుకు ఎత్తావ్ అంటూ కౌంటరిచ్చాడు శివాజీ. ఆ తర్వాత యావర్ ఎక్కువగా తినేస్తున్నాడని.. మిగతా వారి కోసం ఆలోచించడం లేదంటూ ప్రియాంక అతడిని నామినేట్ చేసింది. అయితే నేను సెల్ఫీఫ్.. సిల్లి రీజన్ అంటూ యావర్ అన్నాడు.
అంతకు ముందు శివాజీ ప్రియాంకను నామినేట్ చేయగా.. ఆరుగురు చెయ్యి ఎత్తితే నేనే కనిపించానా అని ప్రియాంక అడగ్గా.. ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయాలి కదా అన్నాడు శివాజీ. ఇక చివరగా ఎప్పటిలాగే హీరో డైలాగ్ కొట్టాడు అమర్ దీప్. గెలిచినవాడు స్వీటు.. ఓడిపోయినవాడు పచ్చిమిర్చి .. అలాగే ఉంటుంది అంటూ డైలాగ్ చెప్పాడు అమర్. ఇక ఐదోవారం తేజ నేరుగా నామినేట్ కాగా.. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, యావర్, శుభ శ్రీ, గౌతమ్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.