బిగ్ బాస్ 6 నాలుగోవారం వీకెండ్ వచ్చేసింది. వారం మొత్తం హౌస్మెంట్స్ ఆట తీరుపై క్లాస్ తీసుకునేందుకు హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. ఒక్కొక్కరి తప్పులను ఎత్తి చూపిస్తూ.. నిల్చోపెట్టి క్లాస్ తీసుకున్నాడు. కానీ తాజాగా విడుదలైన వీకెండ్ ప్రోమోలో గేమ్ ఆడేవాళ్లను తిడుతూ.. పులిహోర బ్యా్చ్ను ఎంకరేజ్ చేసినట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆట మీద కాకుండా శ్రీసత్య మీద ఫోకస్ పెట్టి… రెండుసార్లు జైలుకెళ్లిన అర్జున్ కళ్యాణ్ పై ఫన్నీగా కామెంట్స్ చేశారు. మరోవైపు సీరియస్గా ఆట ఆడినా ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అలాగే ఆరోహితో గొడవ పడి అన్నండ పడేసిన సూర్యకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలదిత్య వల్ల గీతూ ఏడ్చిందంటూ మరోసారి అతడికి కాస్త ఎక్కువగానే క్లాస్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
బాలాదిత్యకు కోపం వచ్చిందని.. కానీ అతడిని ఫ్యామిలీ మెంబర్ అనుకున్న మనిషిని మాత్రం ఏడిపించాడు అంటూ క్లాస్ తీసుకున్నాడు. బాధపడేవాళ్లకు తెలుస్తోంది.. అని చెప్పగా.. ఇక గీతూ సైతం చాలా బాధపడిపోయానంటూ ఫర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక గేమ్ మొత్తం శ్రీసత్య చుట్టూ తిరిగిన అర్జున్ కళ్యాణ్ పై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సమ్ బడీనా.. నీ డ్రీమ్స్ అన్ని తీరిపోయాయి కదా అంటూ కామెడీ చేశారు.
ఇక ఆ తర్వాత సూర్య అన్నం పడేసిన వీడియోను చూపిస్తూ చురకలేశాడు. అన్నం లేక బయట ఎంతో మంది ఉన్నారంటూ సీరియస్ అయ్యాడు. ఫుడ్ విషయంలో ఎవరికీ ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వను. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో అందరికీ తక్కువ ఫుడ్ ఉంది అని మా అందరికి చెప్పావ్. మరీ సూర్య అలా చేస్తే ఏం పీకావ్ అంటూ ఆదిరెడ్డికి ఇచ్చిపడేశాడు. ఇక ఈ వారం ఇనయ సుల్తానా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతూ, రాజ్ అర్జున్, కీర్తి నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.