Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

బిగ్‏బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ గొడవలు పడడం.. అరుచుకోవడం.. అలగడం కామన్.. ఎంతగా గొడవలు పెట్టుకున్నా.. తిరిగి మళ్లీ

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..
Bigg Boss

Updated on: Nov 16, 2021 | 7:22 PM

బిగ్‏బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ గొడవలు పడడం.. అరుచుకోవడం.. అలగడం కామన్.. ఎంతగా గొడవలు పెట్టుకున్నా.. తిరిగి మళ్లీ కలుసుకుని అన్యోన్యంగా ఉంటారు. ఇక నామినేషన్స్ రోజున.. టాస్కులలో ఇంటి సభ్యుల ప్రవర్తన చూస్తే చిన్నపాటి యుద్ధమే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. ఇక బిగ్‏బాస్ ఇంట్లో ప్రాణ స్నేహితులుగా మారినవారు లేకపోలేదు. మొదటి రోజు కొందరు ప్రాణస్నేహితులుగా మారిపోతారు ఇక ఈ సీజన్‏లో సన్నీ, మానస్.. సిరి, షణ్ముఖ్ స్నేహితులుగా మారిపోయారు. అయితే షణ్ముఖ్, సిరి.. బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందు నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్ ఫిలింస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా బిగ్‏బాస్ నుంచి సిరి, షణ్ముఖ్‏లకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అందులో వీరిద్దరు గొడవ పడుతూ కనిపించారు. షణ్ముఖ్ ఒంటరిగా కూర్చుని బాధపడుతుండగా.. సిరి అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. దీంతో షన్నూ.. నేను ఏడ్వడం వలన నువ్వేం తక్కువ కావు. నేనే తక్కువవుతాను. నువ్వు పైకి వెళ్తవు.. నా దగ్గరకు రాకు..దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ చెప్పుకొచ్చాడు. సిరి ఎంతగా ఒదార్చేందుకు ప్రయత్నించినా.. షణ్ముఖ్ దూరం పెట్టడానికి యత్నించాడు. ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందని.. నువ్వు నాకొద్దంటూ ముఖం మీదే చెప్పాడు. దీంతో సిరి ఏడ్చుకుంటూ వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో వెంటనే షణ్ముఖ్ డోర్ తీయమని బ్రతిమిలాడిన గడియ తీయలేదు. ఇక కంగారు పడ్డ కంటెస్టెంట్స్ పరుగెత్తుకుంటూ వెళ్లి సిరిని డోర్ తీయమని బతిమాలడంతో చివరలో డోర్ తీసినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య అంతగా గొడవ ఏం జరిగింది ?.. అనే విషయం ఈరోజు ఎపిసోడ్‏లో తెలియనుంది.

Also Read: Nithiin Macherla Niyojakavargam: నితిన్ మాచర్ల నియోజకవర్గంలో మరో హీరోయిన్.. ప్రకటించిన చిత్రయూనిట్..

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ ‏కుమార్ సంస్మరణ సభ ..కన్నడ పవర్ స్టార్‏కు కర్ణాటక రత్న అవార్డ్..

Kajal Aggarwal: భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ చందమామ.. కాజల్ డెసిషన్ ఏంటంటే..