Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…

బిగ్‏బాస్ సీజన్ 5.. తొమ్మిది వారాలు పూర్తిచేసుకుంది. ఇక తొమ్మిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సన్నీ, కాజల్, శ్రీరామ్, మానస్,

Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్...
Natraj Master

Updated on: Nov 08, 2021 | 5:45 PM

బిగ్‏బాస్ సీజన్ 5.. తొమ్మిది వారాలు పూర్తిచేసుకుంది. ఇక తొమ్మిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సన్నీ, కాజల్, శ్రీరామ్, మానస్, విశ్వ, జెస్సీ, ప్రియాంక నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ముందు నుంచి అనుకున్నట్టుగానే.. ఈవారం విశ్వ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లో మొదటి వారం నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా.. ఫిజికల్ టాస్కులలో ఎంతో కష్టపడినా… తొందరగానే బయటకు అనుహ్యంగా బయటకు వచ్చాడు విశ్వ. అయితే విశ్వ ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణం తను ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వ ఎలిమినేట్ కావడంతో యానీ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చింది.

ఇదిలా ఉంటే.. విశ్వ ఎలిమినేషన్ పై నటరాజ్ మాస్టర్ స్పందించారు. అందరికి సూపర్ ఎగ్జయిట్‏మెంట్ అయ్యే వార్త.. ఇంట్లో నుంచి ఊసరవెళ్లి బయటకు వచ్చేసింది.. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. బిగ్‏బాస్ మొదటి రోజు నుంచి ఇంట్లో వారికి తనదైన స్టైల్లో జంతువుల పేర్లు పెడుతూ వచ్చాడు నటరాజ్ మాస్టర్. యాంకర్ రవిని గుంటనక్కతో పోల్చాడు.. ఇక ఆ తర్వాత.. ఇంట్లో ఊసరవెళ్లి ఉందంటూ మరో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఇలా నటరాజ్ మాస్టర్ అందరికీ జంతువుల పేర్లు పెట్టడంతో నెటిజన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నటరాజ్ మాస్టర్.. అందరికీ జంతువుల పేర్లు పెడుతూ… జూపార్క్ లాగా చూస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఇక మరోసారి విశ్వ ఎలిమినేషన్ పై నటరాజ్ మాస్టర్ స్పందించడంతో నెటిజన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. మరీ నువ్వెందుకు బయటకు వచ్చావు ? నీ పాపాలు ముందే పండాయా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇంకా మారలేదా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. 25 రోజుల్లోనే హైకోర్టు సెట్ వేశారట..

Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..