యాంకర్ అనసూయ.. బుల్లితెరపై.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఓవైపు యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందం.. అభియనంతో తెలుగు ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్న అనసూయకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ ప్రధానపాత్రలో వచ్చిన రంగస్థలం సినిమాలోని అనసూయ తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మూవీల్లోని కీలక పాత్రల కోసం ఆఫర్లు అనసూయకు ముందు క్యూ కట్టాయి. ప్రస్తుతం అనసూయ.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో దాక్షయాని పాత్రలో నటిస్తుంది.
ఇక కెరీర్ పరంగా ఎంతగా బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన రెగ్యూలర్ అప్డేట్స్.. లెటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అలాగే తనకు ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా నెటిజన్స్‌తో ముచ్చటిస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా నెటిజన్లతో చిట్ చాట్ సెషన్లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. మీకు పెద్ద సినిమాలో మంచి రోల్ అవకాశం వస్తే.. అవసరమైతే ఆ క్యారెక్టర్ కోసం గుండు కొట్టించుకుంటారా ? అని ఆమెను ప్రశ్నించాడు. దీనిపై రియాక్ట్ అయిన అనసూయ.. తప్పకుండా.. ఆ క్యారెక్టర్ కోసం అవసరం అనుకుంటే గుండు కొట్టించుకుంటా అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టింది. ఇది చూసి సినిమాలు… క్యారెక్టర్స్ పట్ల అనసూయకు ఉన్న మక్కువ.. డెడికేషన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Rashmi Gautam: మానవత్వం చచ్చిపోయింది.. మానవజాతి అంతరించే సమయం.. రష్మీ గౌతమ్ ఎమోషనల్..