Bigg Boss : వేరేవాళ్లతో నా బెడ్ షేర్ చేసుకొను.. 11 ఏళ్లుగా బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్..
బిగ్‌బాస్ రియాల్టీ షోకు బుల్లితెరపై ఏరేంజ్ క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇటీవలే సీజన్ 9 స్టార్ట్ అయ్యింది. ఈ షోలోకి అడుగుపెట్టాలని చాలా మంది సెలబ్రెటీస్ వెయిట్ చేస్తుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం 11 ఏళ్లుగా బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేస్తుందట.

బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే అన్ని భాషలలో ఈ షోను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో ఇప్పటికే పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ షో 8 సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ సైతం జరిగిపోయింది. అయితే ఓ హీరోయిన్ మాత్రం బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాదు.. దాదాపు 11 సంవత్సరాలుగా ఈ షో ఆఫర్ రిజెక్ట్ చేస్తుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తను శ్రీ దత్తా. వీరభద్ర సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
ఆ తర్వాత సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇటీవలే తన ఇంట్లో వాళ్లు వేధిస్తున్నారని.. టార్చర్ తట్టుకోలేకపోతున్నానని.. ఎవరైనా సాయం చేయాలంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 సంవత్సరాలుగా తనకు బిగ్‌బాస్ ఆఫర్ వస్తుందని.. తనకు రూ.1.65 కోట్లు ఆఫర్ చేసినా ఆ షోకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా జీవితంలో బిగ్ బాస్ షోకు వెళ్లనని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
బిగ్‌బాస్ షోలో మహిళలు, పురుషులు ఒకే బెడ్ పై పడుకుంటారు.. అదే ప్లేస్ లో కోట్లాడుకుంటారు. నా ఆహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ రియాల్టీ షో కోసం ఒకే మంచచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని వారు ఎలా అనుకుంటారు.. ? నేను అంత చీప్ కాదు.. నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్ వెళ్లను.. నా కుటుంబంతోనే కలిసి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..








