AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫ్యామిలీమ్యాన్-2’ కోసం ఫస్ట్‌ టైమ్.. సామ్ ఇలా చేయబోతుంది..

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యింది అక్కినేని కోడలు సమంత. ఇటీవలే సామ్ నటించిన వెబ్‌సిరీస్ 'ఫ్యామిలీమ్యాన్-2' త్వరలోనే విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ ఓటీటీ మాధ్యమాలపై కనువిందు చేయబోతుంది సమంత. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ సిరిస్ కోసం సమంత...

'ఫ్యామిలీమ్యాన్-2' కోసం ఫస్ట్‌ టైమ్.. సామ్ ఇలా చేయబోతుంది..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2020 | 7:46 PM

Share

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యింది అక్కినేని కోడలు సమంత. ఇటీవలే సామ్ నటించిన వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీమ్యాన్-2’ త్వరలోనే విడుదల కానుంది. ఫస్ట్ టైమ్ ఓటీటీ మాధ్యమాలపై కనువిందు చేయబోతుంది సమంత. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ సిరిస్ కోసం సమంత ఓ పని చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోబోతుందట. ఇప్పటికే దీనికి తగ్గట్లుగా హిందీలో తన ప్రావీణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సిరీస్‌లో తీవ్రవాదిగా కనిపించనున్నట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా.. ప్రాంతీయ భాషల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది ఫ్యామిలీ మ్యాన్-2 టీమ్. కాగా రాజ్ నిడమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్