AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasturi Shankar: దేవుడిని దేవుడే కాపాడుకోవాలి.. వీడియో షేర్ చేస్తూ కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్..

టెక్నాలజీ పరంగా మనం ఎంత దూసుకుపోతున్నా.. ఇప్పటికీ దొంగ బాబాలు.. స్వామిజీలను నమ్ముతుంటాయి. మాయమాటలు

Kasturi Shankar: దేవుడిని దేవుడే కాపాడుకోవాలి.. వీడియో షేర్ చేస్తూ కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్..
Kasturi Shankar
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2021 | 5:18 PM

Share

టెక్నాలజీ పరంగా మనం ఎంత దూసుకుపోతున్నా.. ఇప్పటికీ దొంగ బాబాలు.. స్వామిజీలను నమ్ముతుంటాయి. మాయమాటలు చెబుతూ ఇప్పటికీ పలు చోట్లు దొంగ స్వాములు జనాలను మోసం చేస్తుంటారు. తాజాగా ఓ మహిళ అన్నపూర్ణి అరసు అమ్మవారంటూ అక్కడి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అన్నపూర్ణి వీడియోపై గృహలక్ష్మీ సీరియల్ నటి కస్తూరీ శంకర్ తనదైన శైలీలో స్పంధించింది.

బుల్లితెర ప్రేక్షకులకు కస్తూరీ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గృహలక్ష్మీ సీరియల్ తులసిగా ఫ్యామిలీ ఆడియన్స్‏కు సుపరిచితురాలు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఎప్పటికప్పుడు తనదైన శైలీలో స్పందిస్తుంటుంది కస్తూరీ శంకర్. స్వతహాగా లాయర్ అయిన కస్తూరీ సామాన్య ప్రజల నుంచి పొలిటికల్, సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్నపూర్ణ అరసు అమ్మవారి గురించి కౌంటర్ వేసింది కస్తూరీ శంకర్. “కేగల్ ఎక్సర్ సైజ్ డెమో ఇచ్చినట్టుగా ఉంది. ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి దేవుడిని దేవుడే కాపాడాలి. ఇలాంటి గిమ్మిక్కులు చూసి జనాలు నమ్మొద్దు” అంటూ ట్వీట్ చేసింది.

ట్వీట్..

వాస్తవానికి అన్నపూర్ణి అనే మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను, కూతురిని విడిచిపెట్టి అతడితో వెళ్లిపోయింది. ఈమె గతంలో తమిళ్ బతుకు జట్కా బండి షో ద్వారా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె ప్రియుడు అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. ఆ తర్వాత అన్నపూర్ణి ఎక్కువగా కనిపించలేదు. ఇక చాలా రోజుల తర్వాత అన్నపూర్ణి మాత అవతారంలో కనిపించింది. తాజాగా ఓ వివాహ వేడుకలో అన్నపూర్మి ఊగుతూ.. వింతవింతగా ప్రవర్తిస్తూ కనిపించింది.

Also Read: Viral Photo: ఈ హీరోయిన్‏కు తెలుగులో ఫుల్ క్రేజ్.. జూనియర్ సౌందర్య అనేస్తుంటారు.. ఎవరో గుర్తుపట్టారా ? ..

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగు, తమిళ్‌లో దూసుకుపోతుంది… గుర్తుపట్టారా..?

Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటున్న సుధీర్ బాబు.. అందమైన ప్రేమ కథగా రాబోతున్న సినిమా..

Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్‌ మసాలా సాంగ్స్‌.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..