Bigg Boss 6 Telugu: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నాగ్‌.? బిగ్‌బాస్‌ 6కి ఎన్ని కోట్ల రూపాయలో తెలిస్తే..

|

Aug 29, 2022 | 10:52 AM

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌.. 10 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఈ రియాలిటీషో సుపరిచతమే. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెబుతోన్న బిగ్‌బాస్‌ సీజన్‌, సీజన్‌కు...

Bigg Boss 6 Telugu: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నాగ్‌.? బిగ్‌బాస్‌ 6కి ఎన్ని కోట్ల రూపాయలో తెలిస్తే..
Biggboss 6 Telugu
Follow us on

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌.. 10 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఈ రియాలిటీషో సుపరిచతమే. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సరికొత్త అర్థం చెబుతోన్న బిగ్‌బాస్‌ సీజన్‌, సీజన్‌కు ప్రేక్షకులకు ఆదరణ పెంచుకుంటూ పోతోంది. ఎక్కడో అమెరికాలో మొదలైన బిగ్‌బాస్‌ రియాలిటీ షో ట్రెండ్‌ భారత దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విస్తరించిందంటే ఈ షోకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగులోనూ బిగ్‌బాస్‌ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్‌లు పూర్తికాగా, ఇప్పుడు ఆరో సీజన్‌కు ముహూర్తం ఖారరైంది. ఇప్పటికే షో నిర్వహకులు ప్రోమో కూడా విడుదల చేసేశారు.

దీంతో ఈ సారి హౌజ్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారన్న దానిపై ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్‌ ఇంట్లో జరిగే గొడవులు, అలకలు, ప్రేమలు, భావోద్వేగాలు ఇలా ప్రతీ అంశం వీక్షకులను తెగ ఆకట్టుకునేవే. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ 6వ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి నాగార్జున తన రెమ్యూనరేషన్‌ను పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. నాగ్‌ ఈ సీజన్‌ కోసం ఏకంగా రూ. 15 కోట్లు తీసుకుంటున్నాడని చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే గత సీజన్‌లో నాగార్జుకు రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్‌ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్న 6వ సీజన్‌లో కంటెస్టెంట్‌లు ఎవరన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..