AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise Movie: ది ప్యారడైజ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‏తో హైప్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్, సోషళ్ మీడియాలో బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో తెలంగాణ ఫోక్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

The Paradise Movie: ది ప్యారడైజ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‏తో హైప్..
The Paradise
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2026 | 3:35 PM

Share

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. ఒక్కో పాట కోట్లలో వ్యూస్ అందుకుని దుమ్మురేపుతున్నాయి. పక్కా తెలంగాణ యాసలో ఉండే సాహిత్యం.. మాస్ బీట్ దేశాలు దాటి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ యాసలో సినిమాలో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ చిత్రంలో పక్కా తెలంగాణ రా ఫోక్ సాంగ్ ఉండనున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. దసరా సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో మరోసారి ఈ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా మాస్, రా అండ్ రస్టిక్ యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు ఇందులో తెలంగాణ ఫోక్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..

ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. కోట్లలో వ్యూస్ అందుకుని బీభత్సం సృష్టిస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో చాలా పాపులర్ అయిన “ఏశ నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల, మనం ఊగుదమే బాలా.. ” అంటూ సాగే ఈ పాటను ది ప్యారడైజ్ చిత్రంలో పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని ప్రతి దావత్ లో డీజేలలో మారుమోగే ఈ పాట ఇప్పుడు థియేటర్లలో వినిపించనుంది. ఈ పాటకు అటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సైతం మరింత పవర్ ఫుల్ , మాస్ బీజీఎమ్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో ఫోక్ లవర్స్ ఈ సాంగ్ కోసం తెగ వైబ్ అవుతున్నారు. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ తో అల్లాడిపోతున్నామని.. ఇక ఏశ నాగుల కట్ట మీద సాంగ్ ఉంటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పాట పై చిత్రయూనిట్ స్పందించలేదు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

కానీ ఈ పాట పై లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. “రాంగ్ ఎక్స్‏పేక్టేషన్స్ ఏమైనా సెట్ చేశామా ? ” అని ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా కాసర్ల శ్యామ్ రిప్లై ఇచ్చారు. “ఈ సాంగ్ ఉంది. కానీ మొత్తం పాట కాదు. కిర్రెక్కించే లిరిక్స్ వేరే ఉన్నాయి. నన్ను నమ్మండి. ఒక నెక్ట్స్ లెవల్ వైబ్ అయ్యేలా ఉంటుంది” అంటూ రిప్లై ఇవ్వడంతో ఏశ నాగుల కట్ట మీద సాంగ్ ఉందని కన్ఫార్మ్ అయ్యింది. దీంతో ఈ పాట కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు.

కాసర్ల శ్యామ్ ట్వీట్..

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎశ నాగుల కట్ట మీద సాంగ్.. 

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Follow Us