Parasite: ఆస్కార్ మూవీకి నోటీసులివ్వనున్న విజయ్ నిర్మాత..!

Parasite movie: ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో దక్షిణ కొరియన్ సినిమా పారాసైట్ ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పారాసైట్‌కు నాలుగు అవార్డులు వచ్చాయి. అయితే ఈ అవార్డులు వచ్చిన తరువాత ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఆ సినిమాను చూసిన కోలీవుడ్ ‌అభిమానులు ఈ కాన్సెఫ్ట్ మా మూవీ కాపీ అంటూ […]

Parasite: ఆస్కార్ మూవీకి నోటీసులివ్వనున్న విజయ్ నిర్మాత..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 12:23 PM

Parasite movie: ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో దక్షిణ కొరియన్ సినిమా పారాసైట్ ఏకంగా నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో పారాసైట్‌కు నాలుగు అవార్డులు వచ్చాయి. అయితే ఈ అవార్డులు వచ్చిన తరువాత ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఆ సినిమాను చూసిన కోలీవుడ్ ‌అభిమానులు ఈ కాన్సెఫ్ట్ మా మూవీ కాపీ అంటూ నెట్టింట్ట తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

విజయ్ హీరోగా కేఎస్ రవి కుమార్ తెరకెక్కించిన మిన్సార కన్నా కథను పారాసైట్ పోలి ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. అంతేకాదు షాప్ లిఫ్టర్స్ అనే మూవీ ఛాయలు కూడా పారాసైట్‌లో కనిపించినట్లు కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మిన్సార కన్న సినిమా హక్కులు తేనప్పన్ అనే నిర్మాత దగ్గర ఉండగా.. పారాసైట్‌పై ఆయన లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఇంటర్నేషనల్‌ న్యాయవాదితో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే పారాసైట్ దర్శకనిర్మాతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఎక్కువ ఆస్కార్‌లు సాధించిన పారాసైట్‌కు.. కాపీ మరకలు అంటడం అంతర్జాతీయంగానూ హాట్‌ టాపిక్‌గా మారింది.