Chiru 152 News: చిరు మూవీలో ఆ నటుడు.. ఉత్తుత్తి ప్రచారమేనన్న టీమ్..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్‌ను ఫిలింనగర్‌లో రిజిస్టర్ చేయించారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి ఫ్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ కనిపిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దాదాపుగా 40 రోజులను చెర్రీ కేటాయించినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో విలక్షణ నటుడు మోహన్ […]

Chiru 152 News: చిరు మూవీలో ఆ నటుడు.. ఉత్తుత్తి ప్రచారమేనన్న టీమ్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 9:10 AM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్‌ను ఫిలింనగర్‌లో రిజిస్టర్ చేయించారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరంజీవి ఫ్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ కనిపిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దాదాపుగా 40 రోజులను చెర్రీ కేటాయించినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు కనిపించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

చిరుకు విలన్‌గా మోహన్ బాబు కనిపించబోతున్నాడని.. ఆయన పాత్ర ఈ సినిమాకు మరో ప్లస్ అవ్వనుందని ఆ మధ్యన పుకార్లు వినిపించాయి. అందునా 90ల్లో పలు చిత్రాల్లో చిరుకు విలన్‌గా కనిపించారు మోహన్ బాబు. దీంతో దాదాపు 30సంవత్సరాల తరువాత ఈ జోడీని మళ్లీ చూసే అవకాశం వస్తుందని ఫ్యాన్స్ కూడా సంతోషపడ్డారు. కానీ మూవీ యూనిట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మోహన్ బాబు లేరట. అంతేకాదు అసలు ఈ మూవీ కోసం చిరు టీమ్.. విలక్షణ నటుడిని కలవలేదని సమాచారం. ఈ చిత్రంలో మోహన్ బాబు ఇమేజ్‌కు తగ్గ పాత్ర లేకపోవడంతో, ఆయన్ను కలవలేదని టాక్. కాగా ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష మరోసారి నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.